ద‌స‌రాకి ముహూర్తం పెట్టిన‌ నాగ‌శౌర్య

`అలా ఎలా` సినిమాతో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ‌. త‌న‌తో నాగ‌శౌర్య సినిమా ఓకే అయ్యింద‌న్న వార్త ఇండ్ర‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది. శౌర్య చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. మీడియం రేంజు సినిమాల‌కు నాగ‌శౌర్య మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. త‌న కాల్షీట్లు మ‌రో మూడేళ్ల వ‌ర‌కూ ఖాళీ లేవు. ఈ ద‌శ‌లో శౌర్య‌తో – అనీష్ సినిమా ఓకే అవుతుందా? లేదా? అనుకున్నారు. కానీ ఎట్ట‌కేల‌కు ఈ సినిమా ఖ‌రారైపోయింది. ఈనెల 25న ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా మొద‌లెడ‌తాడ‌రు. మ‌హ‌తి సాగ‌ర్ ని సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నారు. `ఛ‌లో` సినిమాకి మంచి బాణీల్ని అందించి, ఆ సినిమా విజ‌యంలో భాగ‌స్వామి అయ్యాడు మ‌హ‌తి. అందుకే నాగ‌శౌర్య మ‌రోసారి త‌న‌పై న‌మ్మకం ఉంచాడు. ఛ‌లోకి కెమెరామెన్ గా ప‌నిచేసిన సాయి శ్రీ‌రామ్ నే ఛాయాగ్ర‌హ‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. ఇదో రొమాంటిక్ కామెడీ సినిమా. క‌థ బాగా న‌చ్చ‌డంతో నాగ‌శౌర్య త‌న హౌం బ్యాన‌ర్ ఐరాలోనే చేయ‌డానికి ఫిక్స‌యిపోయాడు. క‌థానాయిక కూడా ఓకే అ‌యిపోయింది. బాలీవుడ్ నుంచి ఓ కొత్త‌మ్మాయిని హీరోయిన్ గా రంగంలోకి దించ‌నున్నారు. ఆ క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close