నాగ‌శౌర్య టైటిల్ ‘రంగ‌బ‌లి’?

ఇటీవ‌లే ‘కృష్ణ వ్రింద విహారి’తో ఆక‌ట్టుకొన్నాడు నాగ‌శౌర్య‌. ఇప్పుడు ఓ కొత్త సినిమాని ప‌ట్టాలెక్కించాడు. ప‌వ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. దీనికి ‘రంగ‌బ‌లి’ అనే ప‌వర్‌ఫుల్ టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్‌. ‘రంగ’ అనే పాత్ర‌కు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పాత్ర‌ని సూచిస్తూ ఈ టైటిల్ ఖరారు చేసిన‌ట్టు స‌మాచారం. ఇదో యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా. క‌ర్నూలు ఫ్యాక్ష‌నిజం, హ‌త్య‌లు.. వాటి చుట్టూ తిరిగే క‌థ‌. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్ర‌త్యేక‌మైన సెట్ తీర్చిదిద్దారు. ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లోనే నాగ‌శౌర్య క‌ళ్లు తిరిగి కింద ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత‌.. ఆయ‌న ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకొన్నారు. ఈనెల 20న నాగ‌శౌర్య పెళ్లి జ‌రిగింది. త్వ‌ర‌లోనే… ‘రంగ‌బ‌లి’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close