మ‌రో క‌థ ఓకే చేసిన నాగ‌శౌర్య‌

‘ఛ‌లో’ త‌ర‌వాత మ‌ళ్లీ అంత‌టి హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు నాగ‌శౌర్య‌. ఎక్కువ‌గా యువ ద‌ర్శ‌కుల‌తోనే ప‌ని చేస్తున్నాడు. తాజాగా మ‌రో యంగ్ డైరెక్ట‌ర్ క‌థ‌కి ఓకే చెప్పేశాడు. త‌నే అనీష్ కృష్ణ‌. ‘అలా ఎలా’లాంటి రొమాంటిక్ కామెడీతో ఆక‌ట్టుకున్నాడు అనీష్‌. ఇప్పుడు నాగ‌శౌర్య‌కి ఓ క‌థ వినిపించాడు. అది శౌర్య‌కి బాగా న‌చ్చి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఈ సినిమాని శౌర్య త‌న సొంత సంస్థ‌లోనే చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇదో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అని, కుటుంబ విలువ‌ల‌కు, వినోదానికి పెద్ద పీట వేశార‌ని తెలుస్తోంది. శౌర్య నిర్మాత‌గా ఐరాలో మ‌రో సినిమా కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో శౌర్య హీరో కాదు. మ‌రో యువ క‌థానాయ‌కుడు న‌టిస్తాడు. క‌థ మాత్రం శౌర్య‌నే అందిస్తాడు. ఓ యువ క‌థానాయ‌కుడు త‌న బ్యాన‌ర్ లో మ‌రో యంగ్ హీరోతో సినిమా చేయ‌డం, అందులోనూ తాను స్వ‌యంగా క‌థ అందించ‌డం నిజంగా ఓ ఆరోగ్య‌క‌ర‌మైన కొత్త సంప్ర‌దాయం. త్వ‌ర‌లోనే ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌లు రానున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రైమ్‌ : బెంగళూరులో స్పాలు,క్లబ్‌ల వ్యాపారం “అదే”నా..!?

వారాంతం వస్తే మెట్రో నగరాల్లో సందడి సగమైతాదని అందరూ చెప్పుకుంటారు.. కానీ సందట్లో సడేమియాలో కూడా రెట్టింపు అవుతాయి. ఈ విషయం పోలీసులు రైడింగ్ చేసినప్పుడల్లా తెలిసిపోతుంది. బెంగళూరు పోలీసులు ఖాళీగా ఉన్నామని...

కేసీఆర్ ఫటాఫట్ : రూ. 50వేల రైతుల రుణాలు ఈ నెలలోనే మాఫీ..!

ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయలేదని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఏడాది రూ. యాభై వేల వరకూ ఉన్న రైతుల రుణాలను చెల్లించాలని...

ఒలింపిక్స్ : సింధుకు కాంస్య పతకం..!

టోక్యో ఒలింపిక్స్‌లో  పీవీ సింధు రజతం గెల్చుకున్నారు. రజతం కోసం జరిగిన పోరులో చైనా షట్లర్ హీ బింగ్జియాని రెండు వరుస సెట్లలో మట్టి కరిపించిన సింధు.. రజతం కైవసం చేసుకున్నారు. సెమీస్‌లో...

జాబ్ క్యాలెండ్‌లో మార్పులకు జగన్ రెడీ..!?

జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల ఆందోళనలు అంతకంతకూ పెరిగిపోతూండటంతో ఏపీ సర్కార్ పునరాలోచనలో పడినట్లుగా కనిపిస్తోంది. నాలుగు, ఐదు తేదీలలో అన్ని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున నిరసనల ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి....

HOT NEWS

[X] Close
[X] Close