లక్ష్య ట్రైలర్: పడిలేచినవాడితో పందెం ప్రమాదకరం

‘వరుడు కావలెను’తో డీసెంట్ హిట్ అందుకున్నాడు నాగ శౌర్య. ఇప్పుడు శౌర్య నుంచి ఓ స్పోర్ట్స్ డ్రామా వస్తుంది. అదే లక్ష్య. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. విలువిద్య నియమాలు చెబుతూ ట్రైలర్ ఓపెన్ చేశారు. చాలా గ్రిప్పింగ్ గా కట్ చేశారు ట్రైలర్. విలువిద్యలో ఫ్యూచర్ చాంపియన్ పార్ధు గా శౌర్య కనిపించాడు. ”వాడు నిన్ను తప్పించి గెలావాలనుకున్నాడు.. నీవు తప్పుడు దారిలో గెలావాలని అనుకున్నావు. ఇద్దరు ఒక్కటే” అనే డైలాగ్ వింటే.. ఇద్దరు ఫ్రండ్స్ మధ్య జరిగే కధగా అర్ధమౌతుంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే శౌర్య విభిన్నమైన పాత్రలో దర్శనమిచ్చాడు. ట్రైలర్ లో శౌర్య డిఫరెంట్ లుక్ చూపించారు. తన చేయిని తానే గాయపరచుకోవడం, ‘పడిలేచినవాడితో పందెం ప్రమాదకరం’ అని జగపతి బాబు చెప్పిన డైలాగ్ సినిమా కధపై ఆసక్తిని పెంచాయి. విలువిద్య నేపధ్యంలో ఇప్పటివరకూ సినిమా రాలేదు. దీంతో విజువల్స్ అన్నీ ఫ్రెష్ గా అనిపించాయి. కేతిక శర్మ ఇందులో హీరోయిన్‌. నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాళ భైరవ మ్యూజిక్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.