కింగ్ డమ్, వార్ 2… ఇలా వరుసగా రెండు ఫ్లాపులు నాగవంశీ ఖాతాలో పడ్డాయి. ‘కింగ్ డమ్’ కి నాగవంశీ నిర్మాత అయితే… ‘వార్ 2’ని భారీ రేటు ఇచ్చి కొనుక్కొన్నారు. ఈ రెండు సినిమాలతో నాగవంశీ, తనని నమ్ముకొన్న బయ్యర్లు భారీగా నష్టపోయారు. కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు వంశీ. ప్రెస్ మీట్లూ లేవు. ప్రమోషన్ ఈవెంట్లూ లేవు. తాజాగా ‘కొత్త లోక’ సక్సెస్ మీట్ లో ఆయన మొహం పై మళ్లీ నవ్వులు కనిపించాయి. `కొత్త లోక` సినిమాని తెలుగులతో నాగవంశీ విడుదల చేశారు. ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. దాంతో.. ఆయన కాస్త తెరిపిన పడినట్టైంది.
నిజానికి ‘కొత్త లోక’ చిత్రానికి తెలుగులో ప్రమోషన్లు లేవు. నాగవంశీ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు కానీ, పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాస్త మంచి బజ్ వచ్చేసరికి… ప్రమోట్ చేయాలని నిర్ణయించుకొన్నారు. కాకపోతే.. కాస్త లేట్ అయ్యిందంతే. ఈవారం కొత్తగా మూడు సినిమాలు వస్తున్నాయి. దాంతో `కొత్త లోక` పాత సినిమా అయిపోతుంది. మూడు సినిమాల టాక్ కాస్త అటూ ఇటూ అయితే… ఈవారం `కొత్త లోక` ఆడియన్స్ కి ఓ ఆప్షన్ గా ఉండొచ్చు. కాస్త ముందు నుంచీ ఈ సినిమాని ప్రమోట్ చేసుకొని ఉంటే.. వసూళ్లు బాగుండేవి. కానీ ప్రమోషన్లు చేయాలంటే.. నాగవంశీ బయటకు రావాలి. ఆయన వస్తే.. ‘వార్ 2’, ‘కింగ్ డమ్’ రిజల్ట్ గురించి మాట్లాడాలి. అందుకే కాస్త హైడ్ అయ్యారు.
