జ‌బ‌ర్‌ద‌స్త్ నుంచి నాగ‌బాబు ఔట్‌

జ‌బ‌ర్ ద‌స్త్‌లో కామెడీ ఎంత పాపుల‌రో, ఆ కామెడీ చూస్తూ నాగ‌బాబు,రోజాలు ప‌డీ ప‌డీ న‌వ్వ‌డం కూడా అంతే పాపుల‌ర్‌. నాగ‌బాబు ఇచ్చే జ‌డ్జ్‌మెంట్ ఏమీ ఉండ‌దు గానీ, ఆ నవ్వుల కోస‌మే ఆయ‌న‌కు పారితోషికం కూడా ఇస్తుంటారు. కామెడీని బాగా ఎంజాయ్ చేసే నాగ‌బాబు ఈ షోకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అయిపోయారు. అలాంటి నాగ‌బాబు.. ఇప్పుడు జ‌బ‌ర్‌దస్త్ షో నుంచి త‌ప్పుకున్నారు. మ‌ల్లెమాల కీ, నాగ‌బాబుకీ మ‌ధ్య కొన్ని మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ షోని నిర్వ‌హించే ద‌ర్శ‌కుల‌లో కొంత‌మందిని మ‌ల్లెమాల ప‌క్క‌న పెట్టింద‌ట‌. వాళ్లేమో నాగ‌బాబుకి బాగా కావ‌ల్సిన వాళ్లు. అందుకే నాగ‌బాబు కూడా ఈ షో నుంచి త‌ప్పుకున్నారు. అందుకే ఇప్పుడొస్తున్న‌ ఎపిసోడ్ల‌లో నాగ‌బాబు క‌నిపించరు. ఆయ‌న స్థానంలో ర‌ష్మి యాంక‌ర్‌గా రోజా ప‌క్క‌న కూర్చుంటోంది. నాగ‌బాబుకు స‌ర్దిచెప్ప‌డానికి మ‌ల్లెమాల శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. అయితే… తొల‌గించిన‌వాళ్ల‌ని మ‌ళ్లీ టీమ్‌లోకి తీసుకుంటేనే, మ‌ళ్లీ జ‌డ్జ్‌గా వ‌స్తాన‌ని నాగ‌బాబు ష‌ర‌తు పెట్టాడ‌ట‌. ఇప్పుడు దాని గురించే మ‌ల్లెమాల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close