మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన వివాదాస్పదం అవుతుండగా తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ కొత్త చర్చకు దారితీస్తోంది.

వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయడంపై సోమవారం ఓటు వేసిన అనంతరం అల్లు అర్జున్ స్పందించారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రావిచంద్రారెడ్డి తన స్నేహితుడు అని, అందుకే ఆయన మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నానని స్పష్టత ఇచ్చిన అల్లు అర్జున్, తనకు రాజకీయాలతో సంబంధం లేదని, నా అనుకున్న వాళ్ళకు తప్పకుండా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం సోమవారం ఓటింగ్ ముగిసిన తర్వాత నాగబాబు ట్విట్టర్ లో స్పందించిన తీరు చర్చనీయాంశం అవుతోంది.

“మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!,” అని పోస్ట్ చేశారు. ఇది ఎవరిని ఉద్దేశించి నాగబాబు పోస్ట్ చేశారో కాని, అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ – కొణిదెల కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చాయని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగబాబు పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

పవన్ కు మద్దతుగా రామ్ చరణ్, అతని తల్లి సురేఖ పిఠాపురం వెళ్లి పవన్ ను కలిసిన రోజే అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించడం ఫ్యామిలీలో చిచ్చు రాజేసిందన్న టాక్ నడుస్తోంది. పైగా ప్రచారంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తనను ప్రచారానికి ఎవరూ పిలవలేదని, తనే వచ్చానని వ్యాఖ్యానించడం మెగా ఫ్యామిలీకి మింగుడు పడలేదని.. అందుకే ఆగ్రహంతోనే నాగబాబు తాజాగా ట్వీట్ చేసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.

అయితే, పిఠాపురంలో పవన్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొనని అల్లు అర్జున్ నంద్యాల మాత్రం వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ గా ప్రచారం చేయడం పట్ల బన్నీపై ఆగ్రహమే నాగబాబు ట్వీట్ సారాంశమని ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవ్ పార్టీ ఇష్యూ- అడ్డంగా బుక్ అయిన సినీ న‌టి హేమ‌

బెంగుళూరు రేవ్ పార్టీ కొత్త మ‌లుపు తీసుకుంది. రేవ్ పార్టీలో డ్ర‌గ్స్ వాడిన‌ట్లు గుర్తించిన పోలీసులు... నార్కోటిక్ ప‌రీక్ష‌లు చేయిస్తున్నారు. ఇందులో ఏపీకి చెందిన వారే ఎక్కువ‌గా ప‌ట్టుబ‌డ్డ‌ట్లు తెలుస్తుండ‌గా, ఓ...

కంటోన్మెంట్ ఉప ఎన్నిక : విజయం ఎవరిని వరిస్తుందో..?

లోక్ సభ ఎన్నికలతోపాటు తెలంగాణలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక గురించి పెద్దగా చర్చే లేకుండా పోయింది. పార్లమెంట్ ఎన్నికల హడావిడే ఇందుకు ప్రధాన కారణం. మల్కాజ్ గిరి లోక్ సభతోపాటు...

ఈటీవీ నుంచి మ‌రో ఓటీటీ.. ఈసారి వేరే లెవ‌ల్‌!!

సినిమా ప్ర‌పంచంలో ఓటీటీ భాగం అయిపోయింది. సినిమా వ్యాపారంలో ఓటీటీల‌దే కీల‌క భాగ‌స్వామ్యం. అందుకే ఓటీటీల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. మీడియా రంగంలో అగ్ర‌గామిగా నిలిచిన‌ ఈనాడు సైతం ఓటీటీలోకి అడుగు పెట్టింది....

క‌థాక‌మామిషు! (వారం వారం కొత్త క‌థ‌ల ప‌రిచ‌యం)

సాహితీ ప్ర‌క్రియ‌లో క‌థ‌ల‌కు విశిష్ట‌మైన స్థానం ఉంది. మాన‌సిక ఉల్లాసానికీ, స‌రికొత్త‌ ఆలోచ‌నా దృక్ప‌థానికీ క‌థ‌లు త‌మ వంతు సాయం అందిస్తుంటాయి. ఆమ‌ధ్య‌కాలంలో క‌థ‌ల‌కు పెద్ద‌గా ప్రోత్సాహం ల‌భించేది కాదు. అయితే ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close