నాగం దర్శకత్వంలో సినిమా చూపిస్తా ఆగస్ట్ 15నవిడుదల?

ఈనెల 14న రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా నటించిన “సినిమా చూపిస్తా మావ” అనే సినిమా విడుదల కాబోతోంది. దీనికి నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించారు. ఆ మర్నాడే అంటే ఆగస్ట్ 15వ తేదీన అదే టైటిల్ తో మరో సినిమా కూడా విడుదల కాబోతోంది. అది పూర్తిగా హీరో ఓరియంటడ్ మూవీ. కనుక హీరోయిన్ ఉండదు. మొదట విడుదలవుతున్న సినిమా ప్రేమకి సంబంధించినదయితే మర్నాడు విడుదలవుతున్న సినిమా తెలంగాణా బ్యాక్ డ్రాప్ గా వస్తోంది. అంటే నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీయబడిందన్నమాట! దీనిలో హీరోగా మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి చేస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన విలన్ పాత్ర, తెరాస నేతలందరూ ఆయన అనుచరుల పాత్రలు పోషిస్తున్నారు. తెలంగాణా ఉద్యమ సమయంలో పోరాడి తరువాత తమ ఉనికిని కోల్పోయిన వారు అందరూ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనికి కధ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం, కెమెరా, పంచ్ డైలాగులు, ఫైట్స్, నిర్మాణం అన్నిటి బాధ్యతా కూడా బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డే చూసుకొంటున్నారు. ఆగస్ట్ 15వ తేదీన బషీర్ బాగ్ లో మాత్రమే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కదూ? అందరూ సినిమాలోనే ఫ్లాష్ బ్యాక్ చూస్తుంటారు. కానీ నాగం జనార్ధన్ రెడ్డి తీస్తున్న ఈ సినిమా చూడకముందే దాని ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకోవలసి ఉంటుంది లేకుంటే ఇలాగే చాలా కన్ఫ్యూజింగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే:

“తెలంగాణాకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా నాగం జనార్ధన్ రెడ్డి చప్పుడు చేయకుండా కూర్చొన్నాడు” అని తెరాస నేతలు వాయిస్ ఓవర్ తో ఈ సినిమా మొదలవుతుంది. ఆ తరువాత “కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణా రాష్ట్రంలో మాత్రం బీజేపీ పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉందనే” డైలాగు వినిపిస్తుందిట! దానిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పలికినట్లు సమాచారం. అప్పుడే నాగం జనార్ధన్ రెడ్డి కళ్ళు ఎర్రబడతాయి…ఆవేశం వస్తుంది…మహేష్ బాబులాగ పిడికిలి బిగిస్తాడు…తనను, తన పార్టీని విమర్శిస్తున్న తెరాస నేతలపై పంచ్ విసిరేలోగా మనం అధికార పార్టీలో ఉన్నాము సార్! కనుక మనమే డైరెక్టుగా స్ట్రీట్ ఫైట్స్ చేయకూడదని ఎవరో చెప్పడంతో అంత ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోకతప్పలేదు.

అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన ‘సింహంతో ఆటాడుకోవడం…’డైలాగుని మనసులోనే మళ్ళీ మళ్ళీ గట్టిగా చెప్పుకొని ఆగిపోవలసి వచ్చింది. అప్పుడే నాగం కమిట్ అయిపోయారు…తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి, తెరాస ప్రభుత్వానికి కూడా ‘సినిమా చూపించాలని.’ అంటే తన పవర్ ఏమిటో చూపించాలని. ఈ సినిమా టైటిల్ వెనుక ఇంత పెద్ద కధ ఉందన్నమాట. ఇక సినిమా విషయానికి వస్తే నాగం జనార్ధన రెడ్డి తనే స్వయంగా హీరో రోల్ వేసి కేసీఆర్ & కోని రఫ్ ఆడించేయోచ్చు…ఆ కెపాసిటీ కూడా ఉంది. ఎన్నో కలలతో తెదేపాకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరాలనుకొన్న తనను కనీసం టీ-జేఏసీలో కూడా చేరకుండా కేసీఆర్ మోకాలు అడ్డుపెట్టాడనే మంచి రివెంజ్ కోసం పాయింటు కూడా నాగం దగ్గర ఉంది. కానీ కొత్తగా ఈ ‘అధికార పార్టీ సెంటిమెంటు’ ఒకటి అడ్డొస్తోంది.

అందుకే ఒక్క హీరో వేషం తప్ప ఆ సినిమాకి సంబంధించి అన్నీ నాగమే చూసుకొంటున్నారు. దానికి సబ్ టైటిల్ “బచావో తెలంగాణా” అని పెట్టారుట! ముందే చెప్పుకొన్నట్లుగా మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన “బచావో తెలంగాణా” పేరుతో ఒక రాజకీయ ఫోరం ఏర్పాటు చేసి, అందులో తెలంగాణా ఉద్యమ సమయంలో పోరాడిన వారినందరినీ చేర్చుకొని ఉద్యమ సమయంలో రాజకీయ జె.ఏ.సి. ఏవిధమయిన పాత్ర పోషించిందో ఇప్పుడు నాగం దర్శకత్వంలో ఈ బచావో తెలంగాణా సంస్థ కూడా అటువంటి పాత్రే పోషిస్తూ కేసీఆర్ & కో కి సినిమా చూపించబోతోందిట! ఇదీ సినిమా చూపిస్తా ఫ్లాష్ బ్యాక్.
మరి బాహుబలి సినిమా చూడటానికి ఇష్టపడిన కేసీఆర్ నాగం జనార్ధన్ రెడ్డి చూపించాలనుకొంటున్న ఈ సినిమాను చూస్తారో…. లేకపోతే తను స్వయంగా తీస్తున్న తన ‘బంగారి తెలంగాణా’ సినిమా కాపీని ప్రివ్యూ చూడమని పంపిస్తారో చూడాలి…మనమూ చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close