శైల‌జారెడ్డి రివ్యూలు చూసి ఫీలైన స‌మంత‌

సెప్టెంబ‌రు 13 అక్కినిని అభిమానులు ఎప్ప‌టికీ మ‌ర్చిపోరు. ఎందుకంటే ఆ రోజు అక్కినేని కుటుంబం నుంచి రెండు సినిమాలొచ్చాయి. ‘శైల‌జారెడ్డి అల్లుడు’, ‘యూ ట‌ర్న్‌’ రెండూ ఒకేసారి విడుల‌య్యాయి. అయితే ‘యూ ట‌ర్న్’ ముందు శైల‌జారెడ్డి అల్లుడు తేలిపోయింది. రివ్యూలు స‌రిగా లేవు. తొలి మూడు రోజులు మిన‌హాయిస్తే రెవిన్యూ కూడా అంతంత మాత్ర‌మే. యూ ట‌ర్న్‌కి రివ్యూలు, వ‌సూళ్లు రెండూ బాగున్నాయి. `యూ ట‌ర్న్‌` బాగుంద‌న్న సంతోషం కంటే.. ‘శైల‌జారెడ్డి అల్లుడు’ సినిమాకి నెగిటీవ్ రివ్యూలు వ‌చ్చాయ‌న్న బాధే స‌మంతలో ఎక్కువ క‌నిపించింద‌ట‌. ఈ విష‌యాన్ని నాగ్ వెల్ల‌డించాడు. ”భార్యా భ‌ర్త‌ల సినిమా ఒకే రోజు విడుద‌ల అవ్వ‌డం నేనెప్పుడూ చూడ‌లేదు. రెండూ బాగా ఆడాయి. అయితే ఆ రోజు ఉద‌యం శైల‌జారెడ్డి అల్లుడ రివ్యూలు చూసి స‌మంత బాధ ప‌డింది. మ‌రేం ఫ‌ర్వాలేదు వ‌సూళ్లు బాగుంటాయి అన్నాను. నేను అన్న‌ట్టే శైల‌జారెడ్డి కి మంచి వ‌సూళ్లు ద‌క్కాయి. యూ ట‌ర్న్ రివ్యూలు బాగున్నా వ‌సూళ్లు స‌రిగా లేవు. ఆదివారం నాటికి వ‌సూళ్లు పెరుగుతాయి అని చెప్పా. అన్న‌ట్టుగానే వ‌సూళ్లు పెరిగాయి. సెప్టెంబ‌రు మాకు బాగా క‌లిసొచ్చింది. ఈ సెప్టెంబ‌రులోనే వ‌స్తున్న దేవ‌దాస్ ఓ పండ‌గ‌లా ఉంటుంది” అని జోస్యం చెప్పాడు నాగ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close