నాగ్ ఇంట్లో కుక్క‌కి తెలిసింది గానీ…

స‌మంత – నాగ చైత‌న్య‌.. వెండి తెర‌పైనే కాదు, నిజ జీవితంలోనూ మాయ‌గాళ్లు. ఈ విష‌యాన్ని నాగార్జునే ఒప్పుకున్నారు. ‘మ‌జిలీ’ ప్రీ రిలీజ్ వేడుక‌కు నాగార్జున ముఖ్య అతిథిగా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా త‌న కొడుకు, కోడ‌ళ్ల‌పై ఉన్న ప్రేమ‌ని అభిమాల‌ను స‌మ‌క్షంలో వ్య‌క్త‌ప‌రిచారు. ఏం మాయ చేశావె చూశాక‌, ఈ జంట బాగుంద‌ని అనుకున్నాన‌ని, కానీ తెర వెనుక వాళ్ల‌ద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ న‌డుస్తుంద‌ని అనుకోలేద‌ని, మ‌నంలో క‌ల‌సి న‌టించినా క‌నిపెట్ట‌లేక‌పోయాయ‌ని, అంత‌లా మాయ చేశార‌ని చెప్పుకొచ్చారు నాగ్. అంతేకాదు.. స‌మంత తొలిసారి తన ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు ఇంట్లో ఉన్న కుక్క ప‌రిగెట్టుకుంటూ స‌మంత ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయింద‌ని, ఇంట్లో కుక్క‌కి కూడా తెలిసిన విష‌యం త‌న‌కే తెలియ‌న‌లేద‌ని చ‌మ‌త్క‌రించారు నాగ్‌.

ఈ సినిమాలోని ఓ డైలాగ్ విని మ‌న‌సు జివ్వుమంద‌ట‌. చాలా బాధ ప‌డ్డార‌ట‌. ”వెధ‌వ‌ల‌కెప్పుడూ మంచి అమ్మాయిలే దొరుకుతారు` అనే డైలాగ్ విన్న‌ప్పుడు కోపం వ‌చ్చింది. ఓ నాన్న‌లా నాకెలా ఉంటుందో చెప్పండి. మా మంచి అబ్బాయికి మంచి కోడ‌లు దొరికింది” అని చెప్పుకొచ్చారు నాగార్జున‌. ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌ని, ఆ కాన్ఫిడెన్స్ టీమ్ లో తాను చూశాన‌ని, ట్రైల‌ర్ చూస్తున్న‌ప్పుడే రెండు సార్లు క‌ళ్ల వెంట నీళ్లు తిరిగాయ‌ని, సినిమా చూశాక ఎలా ఉంటుందో అర్థం కావ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com