నాగ్‌ని ఏడిపించేసిన శ‌ర్వా

శ‌ర్వానంద్ కొత్త సినిమా `ఒకే ఒక జీవితం` మ‌రో రెండ్రోజుల్లో థియేట‌ర్ల‌లో రాబోతోంది. ఈ సినిమాపై శ‌ర్వాకి చాలా గురి. అందుకే ముందే ప్రీమియ‌ర్ల‌ని ఏర్పాటు చేశాడు. మంగ‌ళ‌వారం రాత్రి సినీ సెల‌బ్రెటీల కోసం ఓ ప్ర‌త్యేకమైన షో వేశాడు. ఈ షోకి నాగార్జున‌, అఖిల్ లు కూడా హాజ‌ర‌య్యారు. చాలా కాలం త‌ర‌వాత అమ‌ల ఈ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అందుకే నాగ్ కి ఈ సినిమా అంటే స్పెష‌ల్ బాండింగ్ ఏర్ప‌డింది. ఈ సినిమా చూశాక‌… నాగ్ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ముఖ్యంగా అమ‌ల – శ‌ర్వాల మ‌ధ్య బాండింగ్, వాళ్ల మ‌ధ్య సీన్‌…. మ‌న‌సుల్ని హ‌త్తుకొనేలా తెర‌కెక్కించాడ‌ట‌. అమ‌ల‌ని ఇలాంటి ఉదాత్త‌మైన‌పాత్రలో చూసిన నాగ్ చ‌లించిపోయార‌ని, థియేట‌ర్లో కొన్ని స‌న్నివేశాల‌కు కంట‌త‌డి పెట్టుకొన్నార‌ని తెలుస్తోంది. షో అయ్యాక‌.. చాలాసేపు శ‌ర్వాతో మాట్లాడారు నాగ్‌. మారుతి, హ‌ను రాఘ‌వ‌పూడి, వ‌శిష్ట‌.. వీళ్లంతా ఈ స్పెష‌ల్ షోకి హాజ‌ర‌య్యారు.

టైమ్ మిష‌న్ నేప‌థ్యంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే వాటిలో లేని యునిక్ పాయింట్ `ఒకే ఒక జీవితం`లో క‌నిపించ‌నుంది. ఓ సైన్స్ ఫిక్ష‌న్‌కి అమ్మ సెంటిమెంట్ జోడించి తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ఇలా రెండు విభిన్న‌మైన జోన‌ర్ల‌ని మేళ‌వించ‌డం కొత్త‌ర‌కం కాన్సెప్టు అనుకోవాలి. థియేట‌ర్లో మంచి ఎమోష‌న‌ల్‌, ఫీల్ గుడ్ మూవీ చూసి చాలా రోజులైంది. మ‌రి… `ఒకే ఒక జీవితం` ఆలోటు ఎంత వ‌ర‌కూ భ‌ర్తీ చేస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close