నాగ్ రాసే పుస్త‌కం: 3 నెల‌ల్లో సినిమా తీయ‌డం ఎలా?

సినిమా మేకింగ్ అనేది చాలా క‌ష్ట‌మైపోయిందిప్పుడు. ఒక్కో సినిమాకీ యేడాదైనా స‌మ‌యం తీసుకొంటున్నారు. క్లైమాక్స్ ఫైట్ సీన్‌కే నెల రోజుల స‌మ‌యం తీసుకొన్న సంద‌ర్భాలు ఉన్నాయి. అలాంటిది ఒక్క సినిమాని 3 నెల‌ల్లో పూర్తి చేయ‌డం విశేష‌మే. నాగార్జున ‘నా సామిరంగ‌’ ఈ ఘ‌న‌త సాధించింది. అక్టోబ‌రులో ఈ సినిమా మొద‌లైంది. ఈ సంక్రాంతికి వ‌చ్చేస్తోంది. ఈమ‌ధ్య కాలంలో ఇంత తొంద‌ర‌గా పూర్త‌యిన సినిమా ఇదే. సినిమా ఫ‌లితం ఎలా ఉండ‌బోతున్నా, త‌క్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయ‌డం ప‌ట్ల నాగార్జున ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

”ఈరోజుల్లో 3 నెల‌ల్లో సినిమా పూర్తి చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. మేమంతా అంత క‌ష్ట‌పడ్డాం. కీర‌వాణి గారు సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే 3 పాట‌లు ఇచ్చారు. ఫ‌స్ట్ ఫైట్ షూటింగ్ చేయ‌కుండానే ఆర్‌.ఆర్ ఫినిష్ చేసి ఇచ్చారు. ఇంత మంచి టెక్నీషియ‌న్లు ఉండ‌బ‌ట్టే ఈ సినిమాని ఇంత త్వ‌ర‌గా పూర్తి చేశాం. ఈ సినిమా గురించి మేం గొప్ప‌లు చెప్పుకోం.. సినిమా స‌క్సెస్ మీట్ త‌ర్వాత మాట్లాడ‌తాం. 3 నెల‌ల్లో సినిమా తీయ‌డం ఎలా అనే పుస్త‌కం రాసిస్తాం..” అని చెప్పారు నాగార్జున‌. ఈ పండ‌క్కి వ‌స్తున్న మిగిలిన 3 సినిమాలూ హిట్ అవ్వాల‌ని ఆకాంక్షించారు. సంక్రాంతి అంటేనే సినిమాల పండ‌గ అని, త‌న‌కు సంక్రాంతి బాగా క‌లిసొచ్చింద‌ని, ఈ సంక్రాంతి కూడా హిట్ కొడుతున్నాం అని అభిమానుల‌కు భ‌రోసా ఇచ్చారు. ఈ సినిమాపై ముందు నుంచీ నాగ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. అందుకే.. థియేట్రిక‌ల్ రైట్స్ మొత్తం ఆయ‌నే తీసుకొన్నారు. డిజిట‌ల్ హ‌క్కులూ మంచి రేటుకి అమ్ముడుపోయాయి. అలా రిలీజ్‌కి ముందే ఈ సినిమా లాభాల్ని చూడ‌గ‌లిగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close