టీవీ9 యాంక‌ర్‌పై నాగ్ చిర్రుబుర్రులు

నాగార్జున మీడియా ఫ్రెండ్లీనే. ఎవ‌రేం ప్ర‌శ్న అడిగినా – స‌మాధానం ఇచ్చేస్తుంటారు. కొన్నికొన్ని ఇబ్బందిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు త‌లెత్తితే – న‌వ్వుతూ స‌మాధానం దాటేస్తుంటారు. అలాంటి నాగార్జున‌కు సైతం కోపం వ‌చ్చింది. టీవీ9 యాంక‌ర్‌పై.

ఈరోజు ఉద‌యం హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్డూడియోస్‌లో ఏఎన్నార్ జాతీయ అవార్డుల ప్ర‌క‌ట‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. అక్కినేని అవార్డుని శ్రీ‌దేవి, రేఖ‌ల‌కు ప్ర‌క‌టించారు. ఇదే సంద‌ర్భంగా నాగార్జున‌ని ఇంట‌ర్వ్యూ చేయాల‌నుకుంది టీవీ9. యాంక‌ర్ కూడా కెమెరా, మైకుతో రెడీ అయిపోయింది.

“మీ నాన్న‌గారు బిగ్ బాస్ హోస్‌లో ఉండి, మీరు హోస్ట్‌గా ఉంటే.. మీ రియాక్ష‌న్ ఏమిటి?” అనే ప్ర‌శ్న సంధించింది యాంక‌ర్ భామ‌. ఇంట‌ర్వ్యూలో అదే తొలి ప్ర‌శ్న‌. అయితే ఈ ప్ర‌శ్న నాగార్జున‌కు న‌చ్చ‌లేదు. ‘లేని నాన్న‌గారిని బిగ్ బాస్ హోస్‌లోకి ఎందుకు లాగుతారు. ముందు కెమెరా మూసేయండి’ అంటూ కాస్త సీరియ‌స్‌గానే స‌మాధానం చెప్పేసరికి అక్క‌డికి వ‌చ్చిన యాంక‌ర్ కూడా… కాస్త చిన్న‌బుచ్చుకుంది. ఆ త‌ర‌వాత యాంక‌ర్‌, నాగ్ మ‌ధ్య కాస్త సంభాష‌ణ జ‌రిగింది. యాంక‌ర్ `సారీ` కూడా చెప్పిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి ఓ ఇంట‌ర్వ్యూ తొలి ప్ర‌శ్న ద‌గ్గ‌రే ఆగిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“అప్పుల కార్పొరేషన్‌”పై కేంద్రం గురి..! లేఖాస్త్రం వచ్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. "ఏపీ స్టేట్‌డెలవప్‌మెంట్ కార్పొరేషన్" పేరుతో చేసిన అప్పుల వ్యవహారం రాజ్యాంగ ఉల్లంఘన అని వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజాగా కేంద్రం ...ఏపీ సర్కార్‌కు లేఖ రాసింది. "ఏపీఎస్‌డీసీ"...

ఏబీవీని డిస్మిస్ చేయండి..! కేంద్రానికి జగన్ సిఫార్సు..!

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావును సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేసింది. ఈ మేరకు శనివారం అర్థరాత్రే రహస్య జీవోను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏబీవీపై...

క్రైమ్‌ : బెంగళూరులో స్పాలు,క్లబ్‌ల వ్యాపారం “అదే”నా..!?

వారాంతం వస్తే మెట్రో నగరాల్లో సందడి సగమైతాదని అందరూ చెప్పుకుంటారు.. కానీ సందట్లో సడేమియాలో కూడా రెట్టింపు అవుతాయి. ఈ విషయం పోలీసులు రైడింగ్ చేసినప్పుడల్లా తెలిసిపోతుంది. బెంగళూరు పోలీసులు ఖాళీగా ఉన్నామని...

కేసీఆర్ ఫటాఫట్ : రూ. 50వేల రైతుల రుణాలు ఈ నెలలోనే మాఫీ..!

ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయలేదని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఏడాది రూ. యాభై వేల వరకూ ఉన్న రైతుల రుణాలను చెల్లించాలని...

HOT NEWS

[X] Close
[X] Close