విడాకుల‌పై నేనేం మాట్లాడ‌లేదు: నాగార్జున‌

నాగ‌చైత‌న్య – సమంత విడాకుల‌పై నాగార్జున స్పందించార‌ని, స‌మంత కోరిక మేర‌కే నాగ‌చైత‌న్య విడాకులు ఇచ్చాడ‌ని, ఇందులో చై చేసిందేం లేద‌న్న‌ట్టు… ఈరోజు సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దాంతో… ఈ విడాకులకు ఏకైక కార‌ణం స‌మంతనే అన్న విష‌యం ఫోక‌స్ అయిన‌ట్టైంది. నాగ‌చైత‌న్య త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో విడాకులు ఇచ్చిన‌ట్టు తేలింది. ఈ రోజుంతా ఇదే హాట్ టాపిక్‌.

అయితే దీనిపై ఇప్పుడు నాగార్జున మ‌ళ్లీ స్పందించారు. సామాజిక మాధ్య‌మాల్లో త‌న పేరుతో వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని, విడాకుల విష‌యంపై తానేం మాట్లాడ‌లేద‌ని, ఆ వార్త‌ల్లో నిజం లేదంటూ.. నాగ్ ట్వీట్ చేశారు. పుకార్ల‌ని వార్త‌లుగా మార్చొద్ద‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. సో.. విడాకుల‌పై నాగార్జున ఏం స్పందించ‌లేద‌న్న‌మాట‌. నాగ్ చెప్పిన‌ట్టు వ‌స్తున్న ఆ వార్త‌లో నిజం లేద‌న్న‌మాట‌. మ‌రి… ఈ కామెంట్లు ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాయి..? నిప్పులేనిదే పొగ రాదంటారు..? నాగ్ ఏమీ మాట్లాడ‌కుండానే పొద్దున్నుంచి టీవీ ఛాన‌ళ్లు, వెబ్ సైట్లూ ఊద‌ర‌గొట్టేస్తున్నాయా? వీడియో రూపంలో ఆ కామెంట్లు బ‌య‌ట‌ప‌డితేనే త‌ప్ప‌.. అప్ప‌టి వ‌ర‌కూ నాగార్జున మాటల్నే న‌మ్మాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలోనూ మసీదులు తవ్వుదామంటున్న బండి సంజయ్ !

బండి సంజయ్ ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన...

అనంతబాబు సస్పెన్షన్ – గౌతంరెడ్డిని చేసినట్లుగానేనా!?

ఎమ్మెల్సీ అనంతబాబును చేయలేక.. చేయలేక సస్పెండ్ చేశారు వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిజంగానే సస్పెండ్ చేశారో లేకపోతే.. గతంలో వంగవీటి రంగాపై...

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close