2016లో కుర్ర హీరో హవా

2016 సంవత్సరం మొదటి రోజునే తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు నాగశౌర్య. తను హీరోగా నటించిన అబ్బాయితో అమ్మాయి సినిమా జనవరి 1న విడుదలవుతుంది. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకం అంటున్నాడు ఈ కుర్ర హీరో. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న అబ్బాయితో అమ్మాయి సినిమాలో పాలక్ లల్వాని కథానాయికగా చేస్తుంది.

ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే శ్రోతలను అలరిస్తున్నాయి. సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేసిన దర్శకుడు రమేష్ వర్మ ప్రమోషన్స్ విభాగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా సక్సెస్ కోసం నాగ శౌర్య చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. ఇక వచ్చే ఏడాది కళ్యాణ వైభోగమే, ఒక మనసు, జ్యో అచ్యుతానంద, కౌటిల్య అనే సినిమాలు చేస్తున్నాడు నాగశౌర్య.

జనవరి 1న విడుదలవుతున్న అబ్బాయితో అమ్మాయి మొదలు 5 సినిమాలతో సంవత్సరం మొత్తం ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెరంగేట్రం చేసిన నాగ శౌర్య.. దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాలతో క్రేజ్ సంపాధించాడు. ఓ విధంగా చెప్పాలంటే రాజ్ తరుణ్ కి కుర్ర హీరోల్లో పోటీ వచ్చే యువ హీరో నాగశౌర్యనే అని చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close