మీడియా వాచ్ : జిల్లాల టాబ్లాయిడ్లు ప్రారంభించిన సాక్షి, నమస్తే తెలంగాణ..!

తెలంగాణలో నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికలు జిల్లా టాబ్లాయిడ్లను పోటాపోటీగా ప్రారంభించాయి. తెలంగాణలో ప్రింట్ మీడియా జోరందుకుంటోంది. ఖర్చులు పెట్టుకుని అయినా మార్కెట్ పెంచుకునేందుకు పత్రికలు పోటీ పడుతున్నాయి. అయితే అన్నీ కాదు.. పత్రిక మీద కాకండా.. ఇతరత్రా ఆదాయాలు..అదీ కూడా.. అధికారం అండ ఉన్న వారి పత్రికలు మాత్రమే దూకుడుగా ఉన్నాయి. కరోనా దెబ్బ కొట్టిన తర్వాత జిల్లా టాబ్లాయిడ్లను మెయిన్‌లో కలిపేసి.. ఒకటి లేదా.. రెండు స్లిప్ పేజీలకు పరిమితం చేసిన యాజమాన్యాలు ఇప్పుడు.. మళ్లీ టాబ్లాయిడ్లను తీసుకు వచ్చాయి. సాక్షి, నమస్తే తెలంగాణ రెండూ ఆదివారం నుంచి జిల్లా అనుబంధాలు ఇస్తున్నాయి. తెలంగాణలో ఎక్కువ జిల్లాలున్నాయి. అయినా ఈ రెండు పత్రికలు వెనక్కి తగ్గలేదు.

మొదట నమస్తే తెలంగాణ టాబ్లాయిడ్ నిర్ణయం తీసుకుంది. తర్వాత సాక్షి కూడా అనుసరించింది. ఈ రెండూ… రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతలకు చెందినవి కావడంతో.. వాటికి దాదాపుగా నిధుల సమస్య లేదు. నమస్తే తెలంగాణలో నిధుల సమస్య అంటూ జీతాలు కత్తిరించినప్పటికీ.. తర్వాత కేసీఆర్ జోక్యంతో తిరిగి ఇచ్చేశారు. సాక్షిలో అసలు జీతాల కత్తిరింపు ఆలోచనే చేయలేదు. అలాగని వాటికి ఆర్థిక సమస్యలు లేకపోలేదు. ఆదాయం పూర్తిగా పడిపోయింది. కానీ అధికార దన్ను ఉంది కాబట్టి.. సాక్షిలో కొన్ని ఫుల్ పేజీ ప్రకటనలు బాగానే కనిపించాయి. నమస్తే తెలంగాణకూ అంతే. అంతే.. ఇప్పుడు టాబ్లాయిడ్లు పెంచిన వారికి పెద్ద ఖర్చేమీ కాదు. న్యూస్ ప్రింట్ ఖర్చు తప్ప.

అయితే.. ఇప్పుడు ఇతర పత్రికలు ఈ భారాన్ని మోయడానికి సిద్ధంగా లేవు. ఆ పత్రికలు ఇస్తున్నాయి కాబట్టి.. అగ్ర దినపత్రిక ఈనాడుపై ఒత్తిడి పెరగక మానదు. ఆ పత్రిక కూడా.. ఈ వారంలో నిర్ణయం తీసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి ఏం చేస్తుందనేది ఆసక్తికరం. ఆ ఖర్చును భరించడానికి సిద్ధపడుతుందో లేదో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సచివాలయ కూల్చివేతలో గుప్తనిధుల కోణం..!

సచివాలయాన్ని గుప్త నిధుల కోసమే కూలగొడుతున్నారన్న వాదనను.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకు వచ్చారు. కేసీఆర్ కనిపించకుండా పోవడం.. ఆర్థరాత్రిళ్లు తవ్వకాలు జరపడం వంటి అంశాలపై తాము పరిశీలన జరిపితే......

వెబ్ సిరీస్‌లు మ‌నకెక్కుతాయా?

ఇప్పుడు ఎవ‌రు చూసినా వెబ్ సిరీస్ ల గురించే మాట్లాడుతున్నారు. స్టార్లంతా అటువైపే చూస్తున్నారు. సినిమాకి మ‌రో గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం వ‌చ్చింద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. నిర్మాణ సంస్థ‌లు అటువైపే, హీరోల చూపూ అటుకేసే....

రద్దయ్యే మండలిలో ఎవరికి పదవులు ఇస్తే ఏంటి..!?

వైసీపీలో శాసనమండలి పదవుల చర్చ నడుస్తోంది. మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ.. ఒక స్థానం సమయం కేవలం 9 నెలలు మాత్రమే ఉండటంతో..ఎన్నిక జరగదు. మరో మూడు స్థానాల్లో రెండు...

న్యూ ఐడియా: ట్రైల‌ర్‌కీ టికెట్టు

ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేట‌లు అచ్చంగా రామ్ గోపాల్ వ‌ర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద‌, రెండొంద‌లు టికెట్టు పెట్టి, ప్రేక్ష‌కుల నుంచి ఎంతో కొంత...

HOT NEWS

[X] Close
[X] Close