‘ఓ బేబీ’ హిట్ట‌యితే నందినికి జాక్ పాట్‌..?

అలా మొద‌లైంది తో ఓ సూప‌ర్ హిట్టు కొట్టింది నందినిరెడ్డి. రెండో సినిమాకే ఆ వేడి చ‌ప్పున చ‌ల్లారిపోయింది.. `జ‌బ‌ర్‌ద‌స్త్‌` అనే సినిమాతో. ఆ సినిమా కూడా హిట్ట‌యితే ఇప్పుడు ఎంచ‌క్కా స్టార్ల‌తో సినిమాలు చేసేదేమో. అయినా ఫ‌ర్వాలేదు. ఓ స్టార్ నందిని రెడ్డి కోసం ఎదురుచూస్తున్నాడు. త‌నే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

`ఓ బేబీ` త‌ర‌వాత స్వ‌ప్న సినిమా సంస్థ‌లో నందినిరెడ్డి ఓ సినిమా చేయాలి. ఇప్ప‌టికే రెండు క‌థ‌లు వినిపించి – ఓకే చేయించుకుంది. అందులో ఓ క‌థ మ‌ల్టీస్టార‌ర్‌. ఈ రెండింటిలో ఏదో ఒక‌టి ఫైన‌ల్ అవుతుంది. సోలో హీరో క‌థ‌లో… విజ‌య్ దేవ‌ర‌కొండ అయితే బాగుంటుంద‌ని నందిని రెడ్డి ఆలోచ‌న‌. కానీ.. విజ‌య్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ఎంత బిజీ అయినా స‌రే విజ‌య్‌కోసం ఎదురుచూస్తానంటోంది నందినిరెడ్డి. అయితే విజ‌య్ నుంచి ఆఫ‌ర్ రావాలంటే మాత్రం `ఓ బేబీ` హిట్టు కావాల్సిందే. ఓ బేబీ హిట్ట‌యితే. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కీ పెద్ద‌గా అభ్యంత‌రం ఉండ‌కపోవొచ్చు. నందినికి `ఓ బేబీ` హిట్టుకావ‌డం అత్యంత అవ‌స‌రం. ఎందుకంటే అది త‌న కెరీర్‌కి ఉప‌యోగ‌ప‌డుతుంది. త‌న‌కు కావ‌ల్సిన హీరోని తెచ్చిపెడుతుంది. నందినితో పాటు టీమ్ అంతా ఈ సినిమాపై చాలా న‌మ్మ‌కంగా ఉంది. మ‌రి ఈ బేబీ.. ఏం చేస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close