అంటే.. బ్రాహ్మ‌ణ అబ్బాయికీ, క్రీస్టియ‌న్ అమ్మాయికీ..

నాని కొత్త సినిమాకి `అంటే.. సుంద‌రానికీ..` అనే ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ పెట్టారు. వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల టైటిల్ టీజ‌ర్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది కూడా య‌మ ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. ఇదో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. క‌థ కూడా కూపీగా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

నాని ఓ బ్రాహ్మ‌ణ అబ్బాయి. ఇంట్లో సంప్ర‌దాయాలు బాగా పాటిస్తారు. అలాంటి అబ్బాయి… ఓ క్రీస్టియ‌న్ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంట్లో మాత్రం `ఆ అమ్మాయి బ్రాహ్మిణే` అని అబ‌ద్ధం చెబుతాడు. అస‌లు.. బ్రాహ్మిణులు ఎలా ఉంటారు? వాళ్ల వేష‌భాష‌లేంటి? అనే విష‌యాల్లో ప్రేమించిన అమ్మాయికి య‌మ ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ల కుటుంబంతో స‌హా ఇంటికి తీసుకొస్తాడు. ఇక్క‌డి నుంచి క‌థ ఏ రూట్లో వెళ్లింద‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ప్రేమ‌లో కులాల ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం స‌హ‌జ‌మైన విష‌య‌మే. అయితే.. దానికి వినోద‌పు పూత పూసే ప్ర‌య‌త్నం చేస్తున్నారిందులో. ప్ర‌తీ స‌న్నివేశాన్నీ లైట‌ర్ వేలో చెప్ప‌బోతున్నార్ట‌.

అయితే.. దాదాపు ఇలాంటి క‌థాంశంతోనే.. ఇది వ‌ర‌కు కొన్ని సినిమాలొచ్చాయి. సీమ శాస్త్రిలో.. హీరో, త‌న కుటుంబంతో స‌హా, రాయ‌ల‌సీమకు వెళ్లి ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతుంటాడు. అక్క‌డ జ‌రిగే హంగామా అంతా న‌వ్వులు పూయిస్తుంది. దాదాపు నాని సినిమా క‌థ కూడా ఇదే లైన్‌. కాక‌పోతే.. హీరో ప్లేసులో హీరోయిన్‌, హీరోయిన్ ప్లేసులో హీరో ఉన్నారంతే. పైగా… నాని కామెడీ టైమింగ్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ క‌థ‌కు త‌ప్ప‌కుండా కొత్త ఫ్లేవ‌ర్ వ‌చ్చి తీరుతుందంతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close