నాని సినిమా టైటిల్ ఫిక్స్

నాని – వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. మ‌ల‌యాళ భామ న‌జ్రియా ఫ‌హాద్ క‌థానాయిక‌. ఈ చిత్రానికి `అంటే.. సుంద‌రానికి` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ ఖ‌రారు చేస్తూ… ఓ చిన్న పాటి ఆడియో టీజ‌ర్ కూడా విడుద‌ల చేశారు. ఆఫీసులో గుస‌గుస‌లు, చివ‌ర్లో నాని ఎంట్రీ, `పాచిక‌లు వేయ‌మందువా..` అంటూ శ‌కుని మామ డైలాగ్‌… మొత్తంగా ఓ ఫ‌న్నీ ప్యాకేజీలా ఉంది. ఈ టీజ‌ర్ చూశాక‌.. సినిమా మ‌రింత వినోదాత్మ‌కంగా ఉండ‌బోతోంద‌న్న న‌మ్మ‌కం వ‌చ్చేసింది. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. 2021లోనే విడుద‌ల చేసేస్తారు. నాని ప్ర‌స్తుతం `ట‌క్ జ‌గ‌దీష్‌`తో బిజీగా ఉన్నాడు. `శ్యామ్ సింగ‌రాయ్‌` కూడా ఓకే చేశాడు. దాంతో పాటు.. ఈ సినిమా కూడా మొద‌లైపోతుంది. వివేక్ సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ...

సుకుమార్‌ని మోసం చేసిన దిల్ రాజు

సుకుమార్ సినిమా అంటే లాజిక్కుతో పాటు, ఐటెమ్ పాట‌లు గుర్తొస్తాయి. 'అ అంటే అమ‌లాపురం' ద‌గ్గ‌ర్నుంచి ఆయ‌న ప్ర‌భంజ‌నం మొద‌లైంది. 'ఊ అంటావా..' వ‌ర‌కూ అది కొన‌సాగుతూనే ఉంది. నిజానికి సుకుమార్‌కు ఐటెమ్...

కిసాన్ సమ్మాన్ కు కొర్రీలు..10 లక్షల మందికి సాయం బంద్..!?

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తూనే అందుకు విరుద్దంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కిసాన్ సమ్మాన్ కోతలకు గురి అవుతోంది. ఈ పథకానికి అనేక కొర్రీలు పెడుతూ...

‘ఆర్య‌’ వెనుక వినాయ‌క్‌

ప్రేమ క‌థ‌ల్లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన సినిమా 'ఆర్య‌'. ఈ సినిమా విడుద‌లై 20 ఏళ్లు పూర్తయ్యింది. అయినా ఇప్పుడు చూసినా 'ఆర్య‌' కొత్త‌గానే క‌నిపిస్తుంది. దానికి కార‌ణం.. సుకుమార్ రైటింగ్‌, మేకింగ్‌....

HOT NEWS

css.php
[X] Close
[X] Close