నాని… బ్రేకింగ్ బ్యాడ్

‘ఐయామ్ నాట్ ఇన్ డేంజర్, ఐయామ్ ది డేంజర్’…. బ్రేకింగ్ బ్యాండ్ వెబ్ సిరిస్ లో ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడిదే డైలాగ్ ని గుర్తు చేసేలా నాని ‘హిట్ 3’ సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చారు. HIT ఫ్రాంచైజీలో శైలేష్ కొలను రెండు సినిమాలు తీశారు. ఆ రెండు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మూడో కేసులో నాని హీరో. అర్జున్ సర్కార్ గా నాని పాత్రని పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

తను డేంజర్ లో ఉన్నాడని ఓ అధికారి హెచ్చరిస్తే తనే ఓ డేంజర్ అని మరో అధికారి సమాధానం ఇవ్వడంతో నాని క్యారెక్టర్ రివిల్ కావడం ఆసక్తికరంగా వుంది. ఇందులో నాని ఇంటెన్స్ అండ్ వైల్డ్ గా కనిపించాడు. మంచు కొండల్లో తీసిన వీడియో లావిష్ గా వుంది. మిక్కీ జే మేయర్ అందించిన నేపధ్య సంగీతం ఇంటన్సిటీని పెంచింది. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. HIT ఫ్రాంచైజీలో రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి రిజల్ట్ చూడటంతో ఈ సిరిస్ లో వస్తున్న మూడో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మే 1, 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అడియోస్ అమిగో రివ్యూ: అపరిచితుల జీవయాత్ర

సినిమా అనగానే ఇంట్రడక్షన్, పాటలు, ఫైట్లు, స్క్రీన్ ప్లే లో త్రీ యాక్ట్.. ఇలా కొన్ని లక్షణాలు ఫిక్స్ అయిపోతాయి. కానీ అప్పుడప్పుడు ఆ రూల్స్ ని పక్కన పెట్టి కొన్ని చిత్రాలు...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం- ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ

తిరుమ‌ల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం అంటే ఎంతో సెంటిమెంట్. క‌ళ్ల‌కు అద్దుకొని తీసుకుంటారు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నంతగా భావిస్తారు. కానీ ఆ ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాసం కొవ్వుతో త‌యారు...

కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టేకోవర్ చేస్తున్నారా?

కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టెకోవర్ చేయబోతున్నారా? అరెస్టుకు ముందు క‌విత భుజానికెత్తుకున్న ఉద్య‌మాన్ని ఇక కేటీఆర్ న‌డ‌ప‌బోతున్నారా...? క‌వితను రాజ‌కీయంగా సైలెంట్ చేసే అవ‌కాశం ఉందా...? బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక సర్కార్ పై...

జ‌న‌సేన‌లోకి బాలినేని… జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాను ఏనాడూ ఏదీ ఆశించ‌కుండా, మంత్రిప‌ద‌విని సైతం వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిస్తే... నాపై ఇష్టం వ‌చ్చినట్లు మాట్లాడిస్తున్నా ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి బాలినేని మండిప‌డ్డారు. జ‌గ‌న్ వెంట‌నే క‌ష్ట‌కాలంలో న‌డిచిన 17మంది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close