నాని సినిమా.. ఈసారి ప్ర‌యోగ‌మే!

క‌థ‌ల ఎంపిక‌లో నాని చూపించే వైవిధ్యం తెలియ‌నిది కాదు. నిర్మాత‌గానూ తన‌ది అదే పంథా. హీరోగా సినిమా చేస్తున్న‌ప్పుడు క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్‌పై ఎక్కువగా శ్ర‌ద్ధ పెట్టే నాని, నిర్మాత‌గా మాత్రం రిస్క్ చేస్తుంటాడు. తాను ప్రొడ్యూస్ చేసిన తొలి చిత్రం ‘ఆ’ ఒక ర‌కంగా ప్ర‌యోగ‌మే. ‘హిట్’, ‘హిట్ 2’ క‌మ‌ర్షియ‌ల్‌గా నానికి మంచి విజ‌యాల్ని అందించాయి. ఇప్పుడు మ‌రోసారి ప్ర‌యోగాత్మ‌క బాట ప‌ట్టాడు. ప్రియ‌ద‌ర్శి హీరోగా నాని సొంత బ్యాన‌ర్ వాల్ పోస్ట‌ర్ ప‌తాకంపై ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. దీనికి ‘కోర్ట్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈరోజు విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్‌లో బోనులో ఉన్న న్యాయ దేవ‌త‌ని చూపించారు. దీన్ని బ‌ట్టి ఇదో కోర్ట్ రూమ్ డ్రామా అనేది అర్థం అవుతోంది. ‘స్టేట్ వర్సెస్ ఏ నో బ‌డీ’ అనే క్యాప్ష‌న్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రామ్ జ‌గ‌దీష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. శివాజీ, సాయి కుమార్‌, రోహిణి, హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌, శ్రీ‌దేవి ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈరోజు హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛనంగా మొద‌లుపెట్టారు. సెప్టెంబ‌రు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హిట్ ఫ్రాంచైజీల‌తో క‌మ‌ర్షియ‌ల్ పంధా అనుస‌రించిన నాని… ఈసారి మాత్రం ఏదో ప్ర‌యోగం చేస్తున్నాడ‌నిపిస్తోంది. కోర్ట్ రూమ్ డ్రామాలకు మంచి డిమాండ్ ఉంది. దానికో సెప‌రేట్ ఆడియ‌న్స్ ఉన్నారు. ప్ర‌యోగాత్మ‌క‌మే అయినా ప‌క‌డ్బందీగా తీస్తే రాసులు రాల్చే టెక్నిక్ ఈ జోన‌ర్‌కు ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

అడియోస్ అమిగో రివ్యూ: అపరిచితుల జీవయాత్ర

సినిమా అనగానే ఇంట్రడక్షన్, పాటలు, ఫైట్లు, స్క్రీన్ ప్లే లో త్రీ యాక్ట్.. ఇలా కొన్ని లక్షణాలు ఫిక్స్ అయిపోతాయి. కానీ అప్పుడప్పుడు ఆ రూల్స్ ని పక్కన పెట్టి కొన్ని చిత్రాలు...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం- ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ

తిరుమ‌ల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం అంటే ఎంతో సెంటిమెంట్. క‌ళ్ల‌కు అద్దుకొని తీసుకుంటారు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నంతగా భావిస్తారు. కానీ ఆ ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాసం కొవ్వుతో త‌యారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close