నాని తెలివితేట‌లు మామూలుగా లేవు!

హీరోగానే కాదు, నిర్మాత‌గానూ నాని స‌క్సెసే. తొలి ప్ర‌య‌త్నంగా `అ` తీశాడు. ఆ త‌ర‌వాత‌… `హిట్` వ‌చ్చింది. రెండూ నానికి మంచి లాభాల్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు `మీట్ క్యూట్` మొద‌లెట్టాడు. ఇది ఓ ర‌కంగా లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఇందులో ఏకంగా అయిదుగురు హీరోయిన్లుంటార‌ని టాక్‌. ఆ అంకె పెర‌గొచ్చు కూడా. ఆ పాత్ర‌ల్లో పేరున్న క‌థానాయిక‌ల‌నే తీసుకోవాల‌న్న‌ది నాని ఆలోచ‌న‌. అన్నీ ఒక‌ట్రెండు రోజుల పాత్ర‌లే. అందుకోసం.. ఆయా హీరోయిన్ల‌ను `అతిథి` పాత్ర‌లంటూ ఒప్పించ‌గ‌లిగాడు నాని. పారితోషికాలు ఇచ్చినా అవి నామ మాత్ర‌మే. పైగా నాని సినిమా కాబ‌ట్టి, అదో ప్ర‌యోగాత్మ‌క సినిమా కాబ‌ట్టి.. హీరోయిన్లూ న‌టించ‌డానికి రెడీ అంటున్నారు. సాధార‌ణంగా హీరోయిన్ల‌ను ఒక‌ట్రెండు రోజుల పాత్ర‌ల‌కు ఒప్పించ‌డం చాలా క‌ష్టం. ఒప్పుకున్నా. బాగా డిమాండ్ చేస్తారు. కానీ.. నాని ద‌గ్గ‌ర ఎవ‌రూ నోరు మెద‌ప‌రు. మొహ‌మాటం కొద్దో. అభిమానం కొద్దో… ఇచ్చిన‌దంతా తీసుకుని చేస్తారు. అలానే ఈ సినిమా పూర్తి చేయాల‌నుకుంటున్నాడు నాని. త‌న నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే క‌చ్చితంగా మేట‌ర్ ఉండే ఉంటుంది. పైగా త‌న సినిమాని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో నానికి తెల‌సు. కాబ‌ట్టి.. బిజినెస్ ప‌రంగా ఈ సినిమా ముందే హిట్టు. సో… నిర్మాత‌గా నాని హ్యాట్రిక్ కొట్టేసిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు బీజేపీ అండ లేదని చేతల్లో చూపిస్తేనే నమ్ముతారు లక్ష్మణ్ జీ !

రెండు రోజులుగా ఏపీలో పర్యటిస్తున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ కె లక్ష్మణ్.. తజన్గ సర్కార్‌పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అమరావతికే తమ మద్దతంటున్నారు. అభివృద్ది లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని...

“ఉద్యమ” పంచాయతీ పెట్టుకున్న కేటీఆర్ !

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. చాలా మందికి సాయం చేస్తూంటారు. విపక్షాలతో పాటు మోదీపైనా విమర్శలకు వాడుకుంటూ ఉంటారు. అయితే రాజకీయ పరమైనవే అయినా... విధానపరంగా ఆ...

ఉత్తదే.. ఆ ప్రచారాన్ని ఖండించిన నాగార్జున …!

విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసే అంశంపై వైసీపీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు నాగార్జున ఇంచ్ కూడా కదల్లేదు. అలాంటి ఆలోచనలు.. ఆశలు .. పెట్టుకోవడం లేదని తేలిగ్గా తీసుకున్నారు. తన కొత్త...

ఆ లెక్కన కేసీఆర్ కూడా ” యాంటీ వైసీపీ గ్యాంగ్‌’లో చేరినట్లేనా సజ్జల !?

తెలంగాణ మంత్రులు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని.. జగన్ పరిపాలనను అవకాశం దొరికిన ప్రతీ చోటా..ఇంకా చెప్పాలంటే అవకాశం సృష్టించుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హరీష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close