అఫీషియ‌ల్: నానితో ‘బ‌ల‌గం’ వేణు

‘బ‌ల‌గం’ సినిమాతో ద‌ర్శ‌కుడిగానూ గుర్తింపు తెచ్చుకొన్నాడు వేణు. ‘బ‌ల‌గం’ త‌ర‌వాత వేణు ఎలాంటి సినిమా చేస్తాడు? ఎవ‌రితో చేస్తాడు? అనే విష‌యాల‌పై చ‌ర్చ న‌డుస్తోంది. నానితో దిల్ రాజు కాంపౌండ్ లో వేణు ఓ సినిమా చేయ‌బోతుప‌న్నాడ‌న్న ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగింది. దీనిపై నాని క్లారిటీ ఇచ్చారు. బ‌ల‌గం అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, ఈ ద‌శాబ్దంలోనే త‌న‌కు న‌చ్చిన చిత్రాల్లో బ‌లగం ఉంటుంద‌ని, వేణు త‌దుప‌రి సినిమా త‌న‌తో ఉన్నా, లేక‌పోయినా, త్వ‌ర‌లోనే వేణుతో ఓ సినిమా ఉంటుంద‌ని, అది కూడా దిల్ రాజు బ్యాన‌ర్‌లోనేన‌ని క్లారిటీ ఇచ్చారు నాని.

Also Read : బాలీవుడ్ Vs సౌత్‌… దూరం పెరుగుతోందా?

”దిల్ రాజుగారి బ్యాన‌ర్‌లో నేను ఓ సినిమా చేయాలి. ‘ద‌ర్శ‌కుడు ఎవ‌రైతే బాగుంటుంది’ అని దిల్ రాజు అడిగిన‌ప్పుడు ‘వేణు అయితే ఓకే’ అని చెప్పాను. ఆ త‌ర‌వాత మేం మాట్లాడుకొన్నాం. ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. వేణు రెండో సినిమా ఎవ‌రితోనైనా చేయొచ్చు. కానీ ఎప్పుడో ఒక‌ప్పుడు మేమిద్ద‌రం సినిమా చేస్తాం” అన్నారు నాని. ‘బ‌ల‌గం’ త‌ర‌వాత వేణుపై పెద్ద బాధ్య‌తే ప‌డింది. ఈసారి కూడా ఆయ‌న మ‌ట్టి మ‌నుషుల క‌థే చెప్ప‌బోతున్నాడు. అందుకోసం క‌థానాయ‌కుడి కోసం అన్వేషిస్తున్నారు. నితిన్‌, శ‌ర్వానంద్ లాంటి హీరోల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. త్వ‌ర‌లోనే వేణు సినిమాలో హీరో ఎవ‌ర‌న్న‌ది తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై క్లారిటీ కోరుకుంటున్న క్యాడర్

జగన్ మోహన్ రెడ్డి మానసిక స్థితి గురించి ఆ పార్టీ నేతలు రకరకాలుగా చెప్పుకుంటారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడానికి ఏ మాత్రం సంకోచించని ఆయన అధికారం ఉన్నప్పుడు.. లేనప్పుడు.. ...

వైఎస్ వివేకా కేసులో కదలిక మళ్లీ ఎప్పుడు ?

వైఎస్ వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక ఎప్పుడు ? ఈ అంశం అనే మందికి ఇప్పుడు సందేహంగా మారింది. ఇప్పుడు దర్యాప్తు లేదు.. ట్రయల్ లేదు. నిందితులు మెల్లగా బెయిల్...

ఓటీటీ ఆడియన్స్ వున్నారు జాగ్రత్త !

సినిమాకి ఇప్పుడు రెండు దశల్లో రివ్యూలు వస్తున్నాయి. థియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్. థియేటర్స్ లో చూస్తున్నపుడు ఆడియన్ మూడ్ వేరు. అక్కడ కాస్త ఉదారంగా ఉంటాడు ప్రేక్షకుడు. మామూలు జోక్...

అప్రూవర్ విశాల్ గున్నీ ?

పోస్టింగ్ ఆశ చూపి ఐపీఎస్ విశాల్ గున్నీతో అన్ని అడ్డగోలు పనులు చేయించారు. ఉన్నతాధికారులు చెప్పిన మాటలను తాను జవదాటలేనని అలా దాటితే.. తన పరిస్థితి ఏమవుతుదో తెలుసు కాబట్టి వారు చెప్పినట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close