నాని సినిమా ‘హిట్‌’

‘అః’తో నిర్మాత‌గా త‌న తొలి ప్ర‌య‌త్నాన్ని విజ‌య‌వంతంగా ప్రారంభించాడు నాని. వాల్ పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై ఇప్పుడు త‌న రెండో చిత్రాన్ని ప్ర‌క‌టించాడు. ఇందులో విశ్వ‌క్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తారు. శైలేష్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి ‘హిట్‌’ అనే పేరు ఖ‌రారు చేశారు. ‘ద ఫ‌స్ట్ కేస్‌’ అనేది ఉప‌శీర్షిక‌. రుహానీ శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తారు. ఇదో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో సాగుతుంద‌ని స‌మాచారం. ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’, ‘ఫ‌ల‌క్‌నామాదాస్’ సినిమాల‌తో క‌థానాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వ‌క్ సేన్‌. ‘ఫ‌ల‌క్‌నామాదాస్‌’ చూశాకే… నాని త‌న సినిమాలో హీరోగా విశ్వ‌క్‌సేన్‌ని ఎంపిక చేసుకున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close