ద‌ర్శ‌కుడికి నాని పెట్టిన ప‌రీక్ష‌

కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌డం అంటే నానికి చాలా స‌ర‌దా, ఇష్టం. ఇండ‌స్ట్రీకి చాలామంది కొత్త ద‌ర్శ‌కుల్ని ప‌రిచ‌యం చేశాడు నాని. వాళ్ల‌లో చాలామంది హిట్లు కొట్టి, విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కులుగా మారారు. ఇప్పుడు ద‌స‌రాతో శ్రీ‌కాంత్ ఓదెల‌ని డెరైక్ట‌ర్ చేసేశాడు. త‌న‌కీ ఇది తొలి సినిమానే. అయితే ఈ సినిమా ఇవ్వ‌డానికి ద‌ర్శ‌కుడికి ఓ పరీక్ష పెట్టాడు నాని. ఇది ఓ ర‌కంగా `ద‌స‌రా` ఫ్లాష్ బ్యాక్ అనుకోవాలి.

ఓసారి.. శ్రీ‌కాంత్ ఓదెల నాని అప్పాయింట్ మెంట్ తీసుకొన్నాడు. గంట‌లో క‌థ చెప్పాల‌న్న‌ది ఒప్పందం. శ్రీ‌కాంత్ చాలా ఇంట్రావ‌ర్ట్‌. అస‌లు త‌ను క‌థ చెప్ప‌గ‌ల‌డా? అనే అనుమానం నానికి వ‌చ్చింద‌ట‌. కానీ… గంట‌లో అయిపోతుంద‌నుకొన్న క‌థ‌ని ఏకంగా 4 గంటలు నేరేట్ చేశాడు శ్రీ‌కాంత్. నాని త‌న కెరీర్‌లో అప్ప‌టి వ‌ర‌కూ విన్న నేరేష‌న్ల‌కు.. శ్రీ‌కాంత్ చెప్పిన నేరేష‌న్ల‌కు అస్స‌లు సంబంధం లేద‌ట‌. క‌థ బాగా న‌చ్చినా.. చెప్పిన‌ట్టు తీయ‌గ‌ల‌డా? లేదా? అనే అనుమానం వ‌చ్చింది నానికి. వెంట‌నే… అస‌లు షార్ట్ ఫిల్మ్ తీయ‌డానికి కూడా స‌రిప‌డ‌నంత ఎమౌంట్ ఇచ్చి, ఈ సినిమాలో రెండు సీన్లు తీసి, నాకు చూపించు.. అప్పుడు ఆలోచిస్తా.. అంటూ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. నాలుగు రోజుల్లోనే, త‌న‌కు న‌చ్చిన న‌టీన‌టుల్ని ఎంపిక చేసుకొని, ఆ రెండు సీన్లూ తీసి నాని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడ‌ట‌. ఎయిర్ పోర్ట్‌కు బ‌య‌లు దేరిన నాని.. దారి మ‌ధ్య‌లో శ్రీ‌కాంత్ ని పిక‌ప్ చేసుకొని, కారులో, లాప్‌టాప్‌లోనే ఆ రెండు సీన్లూ చూసేశాడ‌ట‌. వెంట‌నే.. ఫ్లాట్ అయిపోయి.. ఎయిర్ పోర్టుకి వెళ్లేలోగా `ఈ సినిమా మ‌నం చేస్తున్నాం` అని మాట ఇచ్చేశాడ‌ట‌. ఆ రెండు సీన్లూ నానికి అంత బాగా న‌చ్చాయ‌ట‌. అలా… శ్రీ‌కాంత్ ఓదెల‌కు ద‌ర్శ‌కుడిగా ఛాన్స్ ఇచ్చేశాడు నాని. ఈ సినిమా ఈనెల 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాపై చాలా అంచ‌నాలున్నాయి. మ‌రి.. నానిని మెప్పించిన‌ట్టే బాక్సాఫీసునీ శ్రీ‌కాంత్ మెప్పించ‌గ‌లిగితే, తొలి అడుగులోనే శ్రీ‌కాంత్ ఓదెల ఓ హిట్ వేసుకొంటాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడి ‘ఎస్‌.. బాస్‌’

పిల్ల‌జ‌మిందార్‌, భాగ‌మ‌తి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు అశోక్. ఆ త‌ర‌వాత‌.. అశోక్ ఓ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. అప్ప‌టి నుంచి అశోక్ ఏం చేస్తున్నాడు? త‌న త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అనే...

దక్షిణాదిలో తగ్గిపోయే లోక్‌సభ సీట్లపై కేటీఆర్ ఆందోళన!

దక్షిణాదికి దేశంలో ప్రాధాన్యం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్ సభ సీట్లను తగ్గించబోతున్నారని చాలా కాలంగా పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2026వ...

రైతు భరోసా క్యాలెండర్ తప్పింది !

జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసినా సంక్షేమ క్యాలెండర్ ను మాత్రం వదిలి పెట్టకుండా అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అది కూడా దారి తప్పుతోంది. చెప్పిన...

బింబిసార-2కి కొత్త దర్శకుడు?

కల్యాణ్‌ రామ్‌ సోషియో ఫాంటసీ 'బింబిసార’ మంచి విజయాన్ని అందుకుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మళ్ళీ జోష్ తెచ్చింది. దీనికి పార్ట్ 2 వుంటుందని సినిమా ముగింపులోనే చెప్పారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close