నాని.. ది రియ‌ల్ స్టార్‌

హీరో కుటుంబం నుంచే హీరో వ‌స్తాడు.
స్టార్ ఇంట్లోనే స్టార్ పుడ‌తాడు..
ఇంకెవ్వ‌రికీ ఇక్క‌డ ఛాన్సుల్లేవు. ఎవ‌రొచ్చినా స‌రే తొక్కేస్తారు. ఎవ్వ‌రినీ ఎద‌గ‌నివ్వ‌రు..
– చిత్ర‌సీమ‌లో ఇలాంటి మాట‌లే ఎక్కువ‌గా వినిపిస్తుంటాయి. టాలీవుడ్‌లో గుత్తాధిప‌త్యం ఉంద‌ని, బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎవ్వ‌రూ ఎద‌గ‌లేర‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతుంటారు. కానీ… అలాంటి మాట‌ల‌న్నీ `నాని` లాంటివాళ్లు ఎదురైన‌ప్పుడు చ‌ల్లాచెదురు అయిపోవాల్సిందే.

నాని వెనుక ఎవ‌రున్నారు?
నాని ఏ హీరో కుటుంబం నుంచి వ‌చ్చాడు?
నాని ఏ స్టార్ ఇంట్లో పుట్టాడు?
– ఇలాంటి ప్ర‌శ్న‌లు వేసుకుంటే… టాలెంట్ ఎక్క‌డుంటే అక్క‌డ విజ‌యం ఉంటుంద‌న్న స‌మాధానం ఈజీగా దొరికేస్తుంది. నాని ఎదుగుద‌ల చాలామందికి భ‌రోసా ఇచ్చింది. చిత్ర‌సీమ‌లో ప్ర‌తిభ‌కు, స్వ‌యంకృషికి ఇంకా చోటుంద‌న్న న‌మ్మ‌కాన్ని క‌లిగించింది.

నాని – నుంచి – నేచుర‌ల్ స్టార్‌గా ఎదిగిన ఓ ప్ర‌యాణాన్ని చూస్తే ముచ్చ‌ట‌గా ఉంటుంది. ఆర్‌జేగా ప‌నిచేసిన నానినీ ఇప్పుడు కోట్ల‌కు కోట్లు పారితోషికం అందుకుంటున్న నానినీ చూస్తే స్వ‌యం కృషి అంటే అర్థం తెలుస్తుంది. అష్టాచ‌మ్మాకు ముందున్న నానినీ, ఇప్ప‌టి నానినీ బేరీజు వేసుకుంటే – ప్ర‌తిభ‌కు ప‌ట్టం కట్ట‌డం అంటే ఏమిటో తెలుస్తుంది. సినిమా సినిమాకీ ఎదుగుతూ, టాలీవుడ్ లో ఇప్పుడు మినిమం గ్యారెంటీ స్టార్‌గా ఎదిగాడు నాని. ఆ ప్ర‌యాణం ఎవ‌రికైనా ఓ పాఠం.

నాని సినిమాలు హిట్ల‌య్యాయి. ఫ్లాపుల‌య్యాయి. కానీ… హీరోగా, న‌టుడిగా నాని ఎప్పుడూ ఓడిపోలేదు. స‌హ‌జ‌మైన న‌ట‌న‌కు త‌ను కేరాఫ్‌. అందుకే నేచుర‌ల్ స్టార్ అయ్యాడు. కామెడీ టైమింగ్ విష‌యంలో నానిని ఢీ కొట్టే యువ హీరో ఎవ్వ‌రూ లేరు. ఇది ప‌రిశ్ర‌మ మొత్తం న‌మ్ముతుంది. స‌న్నివేశంలో అర‌కొర ద‌మ్మున్నా త‌న‌దైన న‌ట‌న‌తో.. అల‌రించ‌డం నానికి అల‌వాటైపోయింది. నాని సినిమా అంటే వినోదానికి ఢోకా లేద‌న్న గ్యారెంటీ వ‌చ్చేసింది. ఓవ‌ర్సీస్‌లో నాని సినిమాకి పిచ్చ క్రేజ్‌. ఇదంతా నాని సంపాదించుకున్న ఆస్తి పాస్తులే.

తానొక్క‌డే ఎదిగడం వేరు. త‌న‌తో పాటు మిగిలిన‌వాళ్ల‌కూ ఎదగ‌డానికి సాయం చేసేయం వేరు. విజేత అస‌లైన ల‌క్ష‌ణం అదే. ఇప్పుడు నాని అదే చేస్తున్నాడు. నిర్మాత‌గా మారి, సినిమాలు తీస్తున్నాడు. త‌న సినిమాలో తాను హీరోగా చేయ‌కుండా, మిగిలిన‌వాళ్ల‌కు ఛాన్సిచ్చి – కొత్త‌తరాన్ని ప్రోత్స‌హిస్తున్నాడు. అందుకే… నాని ఓ రియ‌ల్ స్టార్!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిజెపి జనసేన పొత్తు విచ్ఛిన్న యత్నం? జీవీఎల్ కూడా వైకాపా మనిషేనా?

పొలిటికల్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక వర్గం మనిషి గా బయటికి మెలుగుతూ, అంతర్గతంగా వేరే వర్గానికి మద్దతు ఇచ్చే పాత్రలను అప్పుడప్పుడు చూస్తూవుంటాం. అయితే నిజ జీవితంలోని రాజకీయాలలో, పొలిటికల్ థ్రిల్లర్ సినిమా...

వైసీపీ ఎంపీ భూముల్ని వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కినెటా పవర్ ప్రాజెక్ట్స్ అనే సంస్థకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకుంది. నెల్లూరు జిల్లా చిల్లకూర్ మం. తమ్మినపట్నం, మోమిడి గ్రామాల్లో.. ధర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు...

గ్రేటర్ ప్రచారంలో సర్జికల్ స్ట్రైక్స్.. !

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం అంతర్జాతీయ రేంజ్‌కు వెళ్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. వివాదాలు సృష్టించడానికేనన్నట్లుగా చెలరేగిపోతున్నారు. తాజా ఆయన నోటి వెంట సర్జికల్ స్ట్రైక్స్ మాట వచ్చింది. అది...

అభిజిత్‌ను గెలిపించి బిగ్ బాస్ నిర్వాహకులు ఆ తప్పు చేస్తారా!

Sravan Babu, Freelance Journalist బిగ్ బాస్ - 4లో ఫైనల్‌కు చేరుకునే టాప్ 3 కంటెస్టెంట్‌లలో ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడనటంలో ప్రేక్షకులు ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అతనే విన్నర్ అవుతాడనే వర్గాలు...

HOT NEWS

[X] Close
[X] Close