నాని ముందు పెద్ద ఛాలెంజ్

తెలుగులో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్‌ ఫ్రాంఛైజీ చిత్రం ‘హిట్‌’ . తొలి భాగమైన ‘ది ఫస్ట్‌ కేస్‌’లో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించాడు. దానికి కొనసాగిపుంగా తెరకెక్కిన ‘ది సెకండ్‌ కేస్‌’లో అడివి శేష్‌ కనిపించాడు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘హిట్‌ 2’ క్లైమాక్స్‌లో మూడో కేసు హీరో ఎవరో కూడా చెప్పేశారు. అతనెవరో కాదు…నాన. అర్జున్‌ సర్కార్‌గా ఆయన నటించనున్నారు. అయితే హిట్ 3 నానికి ఒక సవాలే. హిట్ 1 పై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కథ క్రైమ్ పట్రోల్ లానే వుంటుంది. అయితే విశ్వక్‌ సేన్‌ ప్రజన్స్ తో ఆ సినిమా లాకొచ్చింది. ఇప్పుడు దాన్ని ఒక యూనివర్స్ గా మార్చాడు దర్శకుడు.

హిట్ 2 కూడా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఏమీ కాదు. రొటీన్ సైకో క్రైమ్ కథే. పైగా చాలా వీక్ స్క్రీన్ ప్లే. మొదట్లో ఒక సీన్ ఓపెన్ చేసి.. దానికి గురించి సినిమా మొత్తంలలో ఒక్కసారి కూడా ప్రస్థావించకుండా..చివర్లో ఆ సీన్ తోనే కనెక్ట్ చేయడం బేసిక్ బిగినర్స్ చేసే పని. అయితే అందులో అడవి శేష్ వుండటం వలన ఇంతలో కొంత పాసైపోయింది. ఇలాంటి స్క్రిప్ట్ లు నాని మీద వర్క్ అవుట్ కావు. నానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. పైగా నాని పోలీసు గా చేస్తున్నాడంటే ఒక అంచనా వుంటుంది. నానికి థ్రిల్లర్స్ కలిసి రాలేదు. ‘వి’ ఫ్లాప్ ఆయింది. ఇప్పుడు హిట్ 3 పై క్రేజ్ వునప్పటికీ దాన్ని అందుకొని ప్రేక్షకులని మెప్పించడం నాని ముందు వున్న మెయిన్ ఛాలెంజ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్ లో కొత్త జోక్‌: మంచు వారి ‘100 కోట్ల‌’ సినిమా

మంచు మోహ‌న్ బాబు, విష్ణు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న మాట‌ల్లో కాస్త అతిశ‌యోక్తులు క‌నిపిస్తుంటాయి. దాంతో అన‌వ‌స‌రంగా ట్రోల్ అవుతుంటారు. వీళ్లెప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా.. మీమ్స్ కి కంటెంట్ ఇచ్చి వెళ్తుంటారు. తాజాగా...

రాజ‌మౌళి మైండ్‌లో ‘ఈగ 2

రాజ‌మౌళి ఎప్పుడూ సీక్వెల్స్‌పై దృష్టి పెట్ట‌లేదు. కానీ ఈమ‌ధ్య త‌న దృష్టి అటు వైపే వెళ్తోంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌కి రెండో భాగం ఉందంటూ ఆమ‌ధ్య ఓ హింట్ ఇచ్చాడు. అయితే దానికంటే ముందు ...

ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ సజ్జల భార్గవ !

సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎవరు .. ఎలాంటి జనబలం లేకపోయినా ప్రభుత్వాన్ని అలవోకగా నడుపుతున్న వ్యక్తి. వ్యవస్థలన్నింటినీ ఎలా వాడేసుకోవాలో పీహెచ్‌డీ చేసిన ఘనుడు. అలాంటి వ్యక్తి కుమారుడు ఎలా ఉండాలి ?...

మీడియా వాచ్ : నెంబర్ 1 పేరుతో పరువు తీసుకుంటున్న చానళ్లు !

గత వారం తాము నెంబర్ వన్ అయ్యామంటూ.. టీవీ9 బృందం .. స్క్రీన్ మీదకు వచ్చి చేసిన హడావుడి తర్వాత.. చాలా మందికి వచ్చిన సందేహం ఒక్కటే.. అదేమిటటి.. టీవీ9 ఇప్పటి వరకూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close