ఒక్కోసారి అంకెలు, లెక్కలు భలే కుదురుతాయి. నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమా నిర్మించనుందనే సంగతి తెలిసిందే. ఈ రోజు ఆఫీషియల్గా అనౌన్స్ చేశారు. హీరోగా నానికి 24వ సినిమా ఇది. విచిత్రం ఏంటంటే… రెండేళ్ల క్రితం తమిళ హీరో సూర్యతో విక్రమ్ కె. కుమార్ ’24’ సినిమా తీశారు. శనివారం రాత్రి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 24 అని ట్విట్టర్లో హడావుడి చేసింది. ప్రేక్షకుల్లో చాలామంది నాని – విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ సినిమా అని ఊహించారు. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నార్ట. ఇటు నాని.. అటు విక్రమ్ కె. కుమార్… “అమ్మాయిలూ! స్పెషల్గా మీ కోసమే ఈ సినిమా” అంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. వేసవిలో లేదా ఆ తరవాత సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. ‘ఇష్క్’ తరవాత మరోసారి విక్రమ్ కె. కుమార్తో కలిసి ఆయన వర్క్ చేస్తున్నారు.