నాన్నకు ప్రేమతో..దిగ్విజయంగా 50 రోజులు

జూ.ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా నేటితో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకొంది. ఈ సినిమా విడుదలయినప్పుడు దానిపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ తరువాత బాగా పుంజుకొంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన అన్ని థియేటర్లలో కూడా నేటి వరకు హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇటీవల కాలంలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా అది ఎంత కలెక్షన్లు రాబట్టిందనే చూస్తున్నారు తప్ప ఎన్ని రోజులు ఆడిందనే విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే పెద్ద హీరోలతో చేసే పెద్ద బడ్జెట్ సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి వందలాది థియేటర్లలో విడుదల చేసి సినిమా విడుదలయిన మొదటి వారం పది రోజుల్లోనే పెట్టుబడి, లాభాలు రాబట్టుకొనే ట్రెండ్ నడుస్తోందిప్పుడు. కనుక జూ.ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దిగ్విజయంగా 50 రోజులు పూర్తిచేసుకోవడం చాలా గొప్ప విషయంగానే భావించవచ్చును. అంతే గాక జూ.ఎన్టీఆర్ సినీ జీవితంలో ఈ సినిమా రెండు వారాల వ్యవధిలోనే  రూ.50 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రంగా మిగిలిపోనుంది. అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్స్ 20 లక్షల డాలర్లు దాటడం మరో విశేషం.

ఇవ్వన్నీ జూ.ఎన్టీఆర్ అభిమానులకీ, ఆ సినిమాయూనిట్ సభ్యులందరికీ చాలా ఆనందం కలిగించే విషయమే. ‘నాన్నకు ప్రేమతో’ ఈరోజు 50 రోజులు పూర్తి చేసుకొన్న ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్, ఈ చిత్ర నిర్మాత బివి.ఎస్.ఎన్.ప్రసాద్, అభిషేక్ పిక్చర్స్ సినీమా యూనిట్ సభ్యులు ఈరోజు హైదరాబాద్ ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ జంక్షన్ వద్ద ఈ సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్ వద్ద భారీ కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని ప్రేకక్షులతో కలిసి పంచుకొబోతున్నారు. ఈ శుభ సందర్భంగా ఈరోజు రాత్రి 9గంటలకి అదే థియేటర్లో ఒక ప్రత్యేక షో వేయబోతున్నారు. దానిలో జూ.ఎన్టీఆర్ నటించిన సినిమాలలో సూపర్ హిట్ పాటలను అభిమానుల కోసం ప్రదర్శించబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బాస్ నుండి దేవి నిష్క్రమణ, టీవీ9 పై జనాల్లో వ్యతిరేకత కూడా కారణమా ?

బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు టిఆర్పీ లతో దూసుకెళుతోంది. కంటెస్టెంట్స్ జాబితా బాగోలేదు అన్న కారణంగా రెండు మూడు రోజుల తర్వాత పడిపోయిన రేటింగులు 10వ రోజు నుండి భారీగా పుంజుకున్నాయి....

పవన్ కళ్యాణ్ ఈనాడు ఇంటర్వ్యూ పై సాక్షి కొమ్మినేని ఏడుపు, ఈనాడు కి నీతులు

ఇటీవల పవన్ కళ్యాణ్ ఈనాడు పత్రికకు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అమరావతి, జగన్ పాలన, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను ఆ...

గ్రేటర్ సమస్యలపై కేటీఆర్‌ని టార్గెట్ చేస్తున్న రేవంత్..!

తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల రాజకీయం రాజుకుంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అంచనా వేయడం కష్టం కానీ.. రాజకీయ నేతలు మాత్రం.. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. గ్రేటర్ పరిధిలో...

ఠాగూర్ అయినా టీ కాంగ్రెస్‌లో అందర్నీ కలపి ఉంచగలరా..!?

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా కుంతియా స్థానంలో మాణిగం ఠాగూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఆయన తెలంగాణలో అడుగు పెట్టి..ఓ సారి సమావేశం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు.. అందరూ ఆయన ఎదుట...

HOT NEWS

[X] Close
[X] Close