“ వైసీపీ వాళ్లు డీఎస్సీని ఆపేందుకు 70 పిటిషన్లు వేశారు. కానీ వాటన్నింటినీ అధిగమించి టీచర్ల నియామకాలు పూర్తి చేశారు” అని ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ మంత్రి నారా లోకేష్‌ను అభినందించింది. ఈ అభినందనకు వందకు రెండు వందల శాతం ఆయన కరెక్ట్ అని.. తాజాగా తెలంగాణ గ్రూప్ వన్ విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి అర్థం చేసుకోవచ్చు. డీఎస్సీ ఎక్కడా న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకోకూడదని నారా లోకేష్ చాలా పకడ్బందీగా ఆలోచించి.. డీఎస్సీ నిర్వహణ పూర్తి చేశారు.
ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంత తేలిక కాదు!
ఈ రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలనుకున్నా చేయలేకపోతున్నాయి. నోటిఫిషన్లు ఇస్తే కోర్టు కేసుల్లో పడుతున్నాయి. ఎలాగోలా పరీక్షలు నిర్వహిస్తే ఏదో ఓ లోపం వెదికి కోర్టులకు వెళ్తున్నారు. చివరికి ఆ ఉద్యోగ నియామకాలు ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. వాటి కోసం తమ జీవితాలను వెచ్చిస్తున్న నిరుద్యోగులు చివరికి ఊసూరోమంటున్నారు. తెలంగాణ గ్రూప్ వన్ స్టోరీ.. పదేళ్లుగా సాగుతోంది. ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా నియామకాలు చేపట్టలేకపోయారు. ఇప్పుడు కూడా మరో ఏడాది పాటు అసాధ్యం. ఆ తర్వాత ఎప్పటికి సాధ్యమవుతుదో చెప్పలేం. కోర్టుల పరిధిలోకి వెళ్లిన ప్రతి నియామకాలకు అదే పరిస్థితి.
అన్నీ ఆలోచించి పకడ్బందీగా డీఎస్సీ నిర్వహణ
నారా లోకేష్ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని చాలా పకడ్బందీగా డీఎస్సీ నిర్వహించారు. మొదట ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా.. జాగ్రత్తలు తీసుకున్నారు. ఏదో ఒకటి చూపించి అడ్డగోలుగా పిటిషన్లు వేసి..స్టేలు తీసుకు రావాలనుకునే బ్యాచ్ వైసీపీ కాబట్టి.. నిరుద్యోగుల ఆశలను వారి కుట్రలకు బలి కాకూడదన్న లక్ష్యంతో లోకేష్ పని చేశారు. అనుకున్నట్లుగానే వారు.. కోర్టుల్లో 70కిపైగా పిటిషన్లు వేశారు. చివరికి సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. కానీ డీఎస్సీ ప్రక్రియను మాత్రం ఆపివేయించలేకపోయారు. అనుకున్నట్లుగా రిక్రూట్మెంట్ సాగిపోయింది. అందుకు నారా లోకేష్ అనుసరించిన వ్యూహమే కారణం . అందుకే కేబినెట్ అభినందించింది.
వైసీపీ కుట్రలకు సరైన విరుగుడు లోకేష్ దగ్గర
వైసీపీ ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్షం అంటే ప్రభుత్వంపై పోరాడాలి. కానీ విచిత్రంగా వైసీపీ వ్యూహం ఏమిటంటే.. ప్రజల్ని నానా తిప్పలు పెడితే.. వారు ప్రభుత్వంపై కోపంతో తమకు ఓట్లు వేస్తారని అనుకుంటారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్న ప్రతీ సారి వారు చేసేది.. అభివృద్ధిని ఆపడం.. నియామకాల్ని ఆపడం.. కాలువ గట్లు కొట్టేయడం వంటి పనులు చేస్తారు. అడ్డంగాదొరికిపోయినా.. అడ్డగోలు వాదనలు చేస్తారు. కానీ వాటన్నింటికీ .. ముఖ్యంగా వైసీపీ కుట్రలకు పూర్తి స్థాయిలో విరుగుడు మంత్రం నారా లోకేష్ దగ్గర ఉందని.. డీఎస్సీ నిర్వహించిన విధానమే తెలిపోయింది.