ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ మార్చడానికి నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలే ఎన్నో విజయాలు అందించేలా చేస్తున్నాయి. ఐదు సంవత్సరాల పాటు జరిగిన విధ్వంసాన్ని పూడ్చుకుని మళ్లీ ఇన్వెస్టర్లలో నమ్కకాన్ని పెంచుకుని ఏపీని పెట్టుబడుల కేంద్రంగా చేయడానికి పాలకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. ప్రతి వారం ఓ ముఖ్యమైన పెట్టుబడుల ప్రకటన వస్తోంది. ప్రయత్నాలన్నీ ఫలించకపోవచ్చు కానీ.. ఎప్పటికైనా ఆ ప్రయత్నాల కష్టం మరో రూపంలో అయినా ఫలితాలను ఇస్తుంది. మంత్రి నారా లోకేష్ ఏపీ కోసం చేస్తున్న ప్రయత్నాలు అలాగే ఫలితాలను ఇస్తున్నాయి.
దిగ్గజం పారిశ్రామిక వేత్తల దృష్టిలో ఏపీ
ఎయిర్ బస్ సంస్థకు చెందిన టీమ్ ఢిల్లీకి వచ్చిందని తెలియగానే వెళ్లి నారా లోకేష్ ఏపీకి సంబంధించిన విశేషాలు, పెట్టుబడుల అనుకూలతలు, తాము ఇచ్చే రాయితీల వంటి వాటితో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎయిర్ బస్కు ఇండియాలో కార్యకలాపాలు, ఉత్పత్తి పెంచాలన్న ఆలోచన ఉంది. కర్ణాటకలోని కోలార్ వద్ద హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ పెడుతున్నారు. టాటాతో కలిసి ఈ ప్లాంట్ పెడుతున్నారు. మరిన్ని ప్రణాళికలు ఉన్నాయని తెలుసుకుని నారా లోకేష్ తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పటికిప్పుడు ఫలితం ఇస్తుందా లేదా అన్నది పక్కన పెడితే.. రాష్ట్రం కోసం ఇలాంటి యాటిట్యూడ్ ఎంతో అవసరం లేదు.
అవకాశాలు సృష్టిస్తున్న నారాలోకేష్
అవకాశాలు వచ్చినప్పుడు అందుకోవడం వేరు.. అవకాశాలు సృష్టించుకోవడం వేరు. అవకాశాలు వచ్చినప్పుడు అందుకోవడం అన్నది ఇప్పుడు ఉన్న కాలంలో వైఫల్యం కిందకు వస్తుంది. ఎందుకంటే నీకు అవకాశం వచ్చే వరకూ ఎవరూ చూడటం లేదు.. మధ్యలో వేరే వారు దాన్ని అందుకుంటున్నారు. అలా మిస్ కాకుండా ఉండాలంటే అవకాశాలను సృష్టించుకోవాలి. ఇప్పుడు నారా లోకేష్ అదే చేస్తున్నారు. ఏపీ కోసం అవకాశాలను సృష్టిస్తున్నారు. గూగుల్ నుంచి ఎయిర్ బస్ వరకూ .. అంతా ఏపీ గురించి ఓ మాట మాట్లాడుకుంటున్నాయంటే.. దానికి కారణం నారా లోకేష్ ప్రయత్నాలే.
ఏపీకి ప్రయత్నాలే ఆశాకిరణాలు
వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఎప్పుడూ పెట్టుబడులు అనే మాటే వినిపించేది కాదు. దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, అరెస్టులు అన్నట్లుగానే సాగేది. రాష్ట్రం గురించి ఆలోచించేవారు ఉండేవారు కాదు. చివరికి రాష్ట్రంలో ఉన్న సంస్థల్ని దండం పెట్టి వెళ్లిపోమంటున్నామని ప్రకటనలు చేసేవారు. వారికి రాష్ట్రం అక్కర్లేదు. రాజకీయమే కావాలి.కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. రాష్ట్రమే ఫస్ట్. అదే ఏపీకి ఓ ఆశాకిరణంగా మారింది.