ఎంత బిజీగా ఉన్నా కార్యకర్తల సంక్షేమం గురించి ఎప్పుడూ మర్చిపోరు నారా లోకేష్. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చిందని అనుకున్నా వెంటనే స్పందిస్తారు. తాజాగా అల్లాభక్షు అనే కార్యకర్త కుటుంబానికి కష్టం వచ్చిందని తెలియగానే.. పిలిపించుకున్నారు. స్వయంగా వారి కష్టం ఏమిటో తెలుసుకుని పరిష్కారం చూపారు. తాను ఉన్నానని ధైర్యం చెప్పారు.
తిరుపతి జిల్లా ఓజిలి మండలం అరిమనిపాడు గ్రామానికి చెల్లిన అల్లాభక్షు పొలం లేని రైతు. గతంలో పొలం ఉండేది కానీ..కోల్పోవాల్సి వచ్చింది. తమ సమస్యను ప్రజా దర్బార్ లో మంత్రి నారా లోకేష్ ను కలిసి చెప్పుకున్నారు. అల్లాభక్షు కష్టం తెలుసుకుని చలించిపోయిన నారా లోకేష్..పిలిపించుకుని మాట్లాడారు. పొలం ఇప్పించడంతో పాటు, పిల్లల విద్యకు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
సోషల్ మీడియాలో అనేక మంది కార్యకర్తలు.. సాయం చేయమని విజ్ఞప్తి చేస్తూంటారు. ఇలాంటి వారికి సాయం చేసేందుకు నారా లోకేష్ ప్రత్యేకమైన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. తన దృష్టికి వచ్చిన వారందరికీ సాయం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ తరపున ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఫుల్ టైం పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.