సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉదయం ప్రశాంతి నిలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్.. సాయికుల్వంత్ మందిరంలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ తో పాటు తో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.


