ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సరే, ఆ ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి ఒనగూరుతున్న ప్రయోజనాలేంటో ఇంకా స్పష్టత రావాల్సి ఉందనుకోండి! కానీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మాత్రం తన ఫ్యామిలీ ప్యాకేజ్ గురించి మాట్లాడారు. ఈ మధ్య వరుసగా విద్యార్థులతో లోకేష్ ఇంటరాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా లోకేష్‌కు ఎదురైన ప్రశ్న ఏంటంటే… ‘మీ ఇంట్లో మీ రోల్ మోడల్ ఎవరు?’ అని ఓ విద్యార్థి ఈ ప్రశ్న అడిగారు.
ఈ ప్రశ్నకు లోకేష్ చెప్పిన సమాధానం ఏంటంటే… ‘మా ఇంట్లో అందరూ రోల్ మోడల్సే! కొన్ని విషయాల్లో మా తాతగారు నాకు రోల్ మోడలు, కొన్ని విషయాల్లో మా నాన్నగారు నాకు రోల్ మోడలు, కొన్ని విషయాల్లో మా మావయ్యగారు రోల్ మోడలు, కొన్ని విషయాల్లో మా అమ్మ నాకు రోల్ మోడలు, కొన్ని విషయాల్లో బ్రహ్మీని కూడా నాకు రోల్ మోడలు! సో.. నాకు అందరూ కలిసికట్టుగా ప్యాకేజ్.. దటీజ్ లోకేష్’ అని సమాధానం ఇచ్చారు. మొత్తానికి లోకేష్‌కు అందరూ రోల్ మోడల్స్ అన్నమాట. లోకేష్‌కు ఎదురైన మరో ప్రశ్న ఏంటంటే… ‘కాలేజ్ లైఫ్‌లో మీరు ఎవరినైనా లవ్ చేశారా..?’ లోకేష్ సమాధానం ఏంటంటే… ‘ఇది మోస్ట్ కాంట్రొవర్షియల్ క్వశ్చన్. కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు మీ అందరిలానే క్రషెష్ ఉండేవి. కానీ, మై వన్ అండన్ ఓన్లీ లవ్ బ్రహ్మీ! దాన్లో ఎలాంటి అనుమానం లేదు. ఇద్దరి కలిసి పెరిగాం. అందుకే, చాలా తక్కువ వయసులో మాకు పెళ్లైపోయింది’ అని చెప్పడంతో విద్యార్థులు సంతోషించారు!
సో.. ఆ విధంగా చైతన్య యాత్ర ద్వారా యువత వెలుబుచ్చుతున్న అనుమానాలను లోకేష్ నివృత్తి చేయడం జరుగుతోంది! ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే… లోకేష్ చెప్పాలనుకుంటున్న విషయాలను విద్యార్థులు అడుగుతున్నారా? లేదా, లోకేష్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని యువత ఉవ్విళ్లూరుతున్నారా.. అనేది! మీరు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారు, మీరు ఎవరినైనా ప్రేమించారా, మీ రోల్ మోడల్ ఎవరు, మీ పాకెట్ మనీకి డబ్బులు ఎవరిస్తారు, బ్రహ్మణి సంపాదిస్తుంటే మీకేం అనిపించడం లేదా… భలే ఉన్నాయి కదా ఈ ప్రశ్నలు. మొత్తానికి ఎవరు రాశారోగానీ ఈ ప్రశ్నలు చాలా బాగున్నాయి! ఈ ప్రశ్నల ద్వారా ఒక నాయకుడిగా యువతకు లోకేష్ ఎంత దగ్గరవుతున్నారో తెలీదుగానీ… ఒక సెలెబ్రిటీగా మాత్రం యూత్‌కి ఫేవరెట్ అవుతున్నారు! ఇక సినిమా తారను అడగాల్సిన ప్రశ్నలన్నీ లోకేష్‌ను అడుగుతున్నట్టున్నారు.