విశాఖలో డేటా క్లౌడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నారా లోకేష్ గుగూల్ ను ఆహ్వానించారు. శాన్ ఫ్రాన్సిస్కో లోని గూగుల్ క్యాంపస్ ను నారాలోకేష్ సందర్శించారు. గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్, గ్లోబల్ నెట్ వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కాలే. బిజినెస్ అప్లికేషన్స్ ఫ్లాట్ ఫామ్ వైస్ ప్రెడిసెంట్ , రావు సూరపునేని , గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్ చందు తోటతో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ హబ్ గా తయారవుతోందని.. విశాఖపట్నంలో డాటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించామని లోకేష్ గూగుల్ వైస్ ప్రెసిడెంట్స్‌కు తెలిపారు.
పబ్లిక్, ప్రైవేటు పార్టనర్ షిప్ మోడ్ లో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన ప్రాంతమని తెలిపారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎఐ ఆధారిత ఈ-గవర్నెన్స్, స్టార్ట్ సిటీ కార్యక్రమాలను అమలుచేస్తోందని ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా మెరుగైన పౌరసేవలు అందించేందుకు ఎఐ టూల్స్, ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్ కల్పించండి. స్టార్ట్ సిటీల్లో జియో స్పేషియల్ సేవల్లో భాగంగా రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అర్బన్ ప్లానింగ్‌తో సహా స్మార్ట్ సిటీ కార్యక్రమాలను గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానించడం కోసం ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎపిలో డిజిటల్ ఎడ్యుకేషన్, యువత నైపుణ్యాభివృద్ధికి ఎఐ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించండి. డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడం, ఎఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్మార్ట్ సిటీ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఎపి ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు. ఏపీ ప్రతిపాదనల్ని కంపెనీలో చర్చిస్తామని లోకేష్‌కు వైస్ ప్రెసిడెంట్స్ హామీ ఇచ్చారు.