నారా లోకేష్ లండన్ లో బిజీగా ఉన్నారు. నవంబర్ లో విశాఖలో నిర్వహించబోయే పార్టనర్ షిప్ సమ్మిట్ కు .. దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు వెళ్లారు. వారితో చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన నుంచి అనూహ్యంగా ఓ ట్వీట్ వచ్చింది. ఓ కంపెనీ ఈ సీఈవోకి.. విశాఖలో ఉన్న వనరులు, మౌలిక సదుపాయాల గురించి వివరిస్తూ.. చేసిన ట్వీట్ అది. లోకేష్ ఉన్న బిజీలో ఆ ట్వీట్ ను అంతగా పట్టించుకోవాల్సిన వాతావరణం ఉండదు. కానీ చిన్న చాన్స్ వదులుకోవడం కూడా లోకేష్ కు ఇష్టం ఉండదు. అందుకే స్పందించారు.
బ్లాక్ బక్ అనే కంపెనీ సీఈవో.. బెంగళూరులోని బెల్లందూరులో తమ ఆఫీసు, ఇల్లు ఉందని.. రోడ్లు, ట్రాఫిక్ సమస్యల కారణం ఇక ఎంత మాత్రామూ బెంగళూరు నుంచి ఆపరేట్ చేయలేమని అనుకున్నారు. అదే విషయాన్ని ట్విట్టర్ లో చెప్పారు. నారా లోకేష్ ఈ అవకాశాన్ని వదులుకోవాలనుకోవడం లేదు. బ్లాక్ బక్ యూనికార్న్ స్టార్టప్. యూనికార్న్ విశాఖకు తరలి వస్తే.. స్టార్టప్లకు మరింత ఉత్సాహం వస్తుంది. అందుకే.. బ్లాక్ బక్ సీఈవోకు.. ఆహ్వానం ఇచ్చేశారు.
విశాఖను సాఫ్ట్ వేర్ సిటీగా మార్చాలనుకుంటున్న లోకేష్.. అక్కడి మౌలికసదుపాయాల్ని , ప్రభుత్వ సహకారాన్ని చూపిస్తూ విస్తృతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. ఆయా కంపెనీలు వస్తాయా రావా అన్న సంగతి పక్కన పెడితే ఇలా మార్కెట్ చేసుకోవడం ద్వారా ఏపీపై పారిశ్రామికవేత్తలలో ఓ మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఎప్పుడైనా తమ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ ఉంటే.. ముందుగా ఏపీనే గుర్తుకు తెచ్చుకుంటారు.