అన్నా నారా లోకేష్..కష్టం వచ్చిందన్నా అని పిలిస్తే చాలు.. వెంటనే స్పందన వస్తోంది.తన టీమ్ ను అలర్ట్ చేసి కష్టంలో ఉన్న వారికి సాయం అందేలా చూస్తున్నారు. ఇలా అడుగుతోంది సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలే కాదు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా.
వైసీపీ సోషల్ మీడియాలో చాలా అకౌంట్లు యాక్టివ్ గాఉంటాయి. అందులో రకిట పేరుతో ఓ అకౌంట్ ఉంటుంది. ప్రభుత్వాన్ని సద్విమర్శలతో రాజకీయం చేయడం కన్నా బూతులు, ఫేక్ పోస్టులతో ప్రసిద్ధి. నారా లోకేష్ పై ఎన్ని తిట్లను తిట్టి ఉంటారో చెప్పాల్సిన పని లేదు. ఈ అకౌంట్ కూడా అన్నా.. నారా లోకేష్ అన్నా సాయం ప్లీజ్ అని అడిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ సోషల్ మీడియా కార్యకర్త బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. ఆస్పత్రిలో చేర్పించారు. ఎవరూ పట్టించుకోలేదు. వైసీపీ నేతలు కూడా అడ్రస్ లేరు.
దాంతో నారా లోకేష్ తో పాటు అందర్నీ అభ్యర్థిస్తూ పోస్టు పెట్టారు. నారా లోకేష్ వెంటనే స్పందించి ఉన్నత వైద్యం అందేలా ఏర్పాటు చేశారు. రకిట అయినా.. గెడ్డం ఉమ అయినా మరో వైసీపీ కార్యకర్త అయినా నారా లోకేష్ ను అడుగుతున్నారంటే.. ఖచ్చితంగా సాయం చేస్తారన్న నమ్మకమే. ఇతర పార్టీ కార్యకర్తల్లోనూ నారా లోకేష్ ఇలా ఇమేజ్ తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. నారా లోకేష్ దాన్ని సాధిస్తున్నారు.