“లోకేష్ చేయించాడని గోల చేద్దాం “ అని పేర్ని నాని తన ఫోన్ లో అందరికీ వినిపించేలా చెప్పడం వైరల్ అయింది. పైకి వినిపించింది కాబట్టి అందరికీ తెలిసింది కానీ.. గత కొద్ది రోజుల నుంచి నారా లోకేష్ పేరు మీద ఏదో ఓ కుట్ర చేయాలని ఆలోచనలు పన్నుతూనే ఉన్నారు. ఏం జరిగినా నారా లోకేష్ అని ఆరోపిద్దామని డిసైడయిపోయారు. ఓ రకంగా జగన్ నుంచి నేతలందరికి లోకేష్ ఫోభియా పట్టుకుంది!
ఏం జరిగినా రెడ్ బుక్ అంటూ ఉలిక్కి పడుతున్న నేతలు
తమ ఇంటి ముందు గాలికి చెట్టు విరిగిపడినా ఉలిక్కి పడుతున్నారు వైసీపీ నేతలు. ఇదంతా లోకేష్ రెడ్ బుక్ పనేనని అనుకుంటున్నారు. వెంటనే మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు. సహజంగా జరగిపోతున్న వాటిని కూడా రెడ్ బుక్ అనుకుంటూ… భయపడుతున్న తమ నేతల్ని చూసి .. వైసీపీ క్యాడర్ కూడా వణికిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుడు పనులు కొండల్లా ఉన్నాయి . ఎప్పుడు వచ్చి ఏం చర్యలు తీసుకుంటారోనని వారు కంగారు పడుతున్నారు. అందుకే .. పక్కన పిల్లి ఏదైనా ప్లేట్ కింద పడేసినా .. రెడ్ బుక్ అని అరుస్తున్నారు.
ఒకప్పుడు పప్పు అని ఎగతాళి చేశారు -ఇప్పుడు నిప్పు !
నారా లోకేష్ .. రాజకీయాల్లోకి రాక ముందు నుంచి ఆయన వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేశారు. పప్పు అని ఎగతాళి చేయడం ప్రారంభించారు. ఎందుకంటే ప్రఖ్యాత స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకోవడం.. నీట్ షేవ్ తో ఉండటంతో టార్గెట్ చేశారు. రాజకీయాలంటే రౌడీల కోసమేనని వారు అనుకునేవారు. అలాంటి ముద్ర వేసుకున్నారు. భరించినంత కాలం భరించారు. కానీ లోకేష్ ఎప్పుడైనా ఇక వారనుకున్నట్లుగా మారాలనుకున్నారో అప్పుడే సీన్ మారిపోయింది. ఎంతగా అంటే లోకేష్ ను తల్చుకోనిదే వారికి రోజు గడవడం లేదు. లోకేష్ భయంతో నిద్ర కూడా పోతున్నారో లేదో మరి.
రాజకీయాల్లో ఎవర్ని తక్కువ అంచనా వేసినా ఇంతే !
ఇప్పుడు ఎంత మంది వైసీపీ నేతలు రహస్యంగా నారా లోకేష్ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారో టీడీపీ నేతలకు తెలుసు. ఒగ్గేయండి మహా ప్రభో అని సంధి ప్రేలాపనలకు పోతున్నారు. కానీ నారా లోకేష్ వారు ఊహించినటువంటి లీడర్ కాదు. కాళ్ల బేరానికి వస్తే .. వదిలేస్తారని.. తర్వాత మళ్లీ తమ నోటి దురుసు తాము తీర్చుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ లోకేష్ చట్టాలను తన పని తాను చేసుకోనిస్తూనే ఉంటారు. చట్టపరంగానే అన్నీ చేసేస్తున్నారు. వైసీపీ నేతలకు టెర్రర్ పుట్టిస్తున్నారు.