24 నుంచి మళ్లీ యువగళం

నారా లోకేష్ పాదయాత్ర యువగళాన్ని మళ్లీ 24వ తేదీ నుంచి ప్రారంభిచాలని అనుకుంటున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. చంద్రబాబు విషయంలో సుప్రీంకోర్టు 17ఏపై తీర్పు రావాల్సి ఉంది. కేసు మెరిట్స్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా అనుకూల తీర్పు వస్తుందని గట్టి నమ్మకంతో టీడీపీ వర్గాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో సానుకూల ఫలితం వస్తే ఇక చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ అక్రమం అవుతాయి. మళ్లీ పెట్టాలనుకుంటే గవర్నర్ ద్వారా అనుమతి తీసుకోవాలి.

ఒక వేళ సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు రాకపోతే తదుపరి న్యాయపోరాటంపై ప్లాన్ బీ రూపొందించుకున్నారు. ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రత్యేకమైన వ్యూహం అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే న్యాయస్థానాల్లో చంద్రబాబు రాజకీయ కార్యక్రమాలకు అడ్డం రాకుండా ఉండేలా రిలీఫ్ తెచ్చుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. .. ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని ఇక వెనక్కి తగ్గకూడదని నిర్ణయానికి వచ్చారు.

యువగళం పాదయాత్ర అద్భుతమైన స్పందన ద్వారా సాగిది. తూ.గో జిల్లా వరకూ వచ్చింది. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆగింది. చంద్రబాబును జైల్లో పెట్టి… న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని బెయిల్ కూడా రాకుండా వాయిదాల మీద వాయిదాలు వేసి బండి నడిపించారు. చివరికి మధ్యంతర బెయిల్ వచ్చింది. ఇక ఎలాంటి పరిస్థితి ఉన్నా… యువగళాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలు మరో 120 రోజుల్లోనే ఉన్నందున అరవై రోజుల్లో యువగళాన్నిపూర్తి చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నయి. దేశంలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ లభించింది. జాతీయ మీడియాలు...

ఏపీ పోలీసులతో సాగర్ గేట్లు ఎత్తేయించి జగన్ రెడ్డి సాధించిందేంటి ?

తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్టు చేయాలంటే వారు అందుబాటులో ఉన్నా సరే. అర్థరాత్రి వాళ్లు నిద్రపోయిన తర్వాత గేట్లు దూకి, తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేస్తారు. అది కోర్టులో నిలబడని కేసు.....

ప్రాసెస్‌లో క్వాష్ పిటిషన్‌పై తీర్పు : సుప్రీంకోర్టు ధర్మాసనం

చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు ప్రాసెస్ లో ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై...

తెలంగాణ ఓటరు నిరాసక్తత

తెలంగాణ ఓటరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పెద్ద పెద్ద క్యూలైన్లు ఎక్కడా కనిపించడం లేదు. మధ్యాహ్నం ఒంటింగంట వరకూ పోలింగ్ పర్సంటేజీ కేవలం 37 శాతం వరకే ఉంది. 2018లో ఇది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close