నారా లోకేష్ ఇంట్లో ఉగాది పూజ చేసుకున్నట్లుగా ఫోటోలు పెడితే అందులో ఏవో బొమ్మలున్నాయి.. అవి క్షుద్ర పూజలకు చెందినవని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. అవి చూస్తే అర్థమైపోతుంది. పిల్లలు చేసిన బొమ్మలు అని. పూజల గురించి పెద్దగా తెలియని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కొత్తగా పూజగదుల్లో తప్పులు వెదికి తప్పుడు ప్రచారాలు చేయడానికి ఇలాంటి అంశాలను ఎంచుకుంటున్నారు.
నారా లోకేష్ ఈ అంశంపై స్పందించారు. నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు దేవాన్ష్ శివుడు, శివలింగం బొమ్మల్నితయారు చేసుకుని వాటిని గుర్తుగా పూజగదిలో పెట్టాడని.. అతిగా ఆలోచించేవాళ్లకు సమాధానం ఇచ్చారు. నారా లోకేష్ ఇలా క్లారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంట్లో పిల్లలు ఉన్న వారికి, నిజమైన హిందువులకు అసలు డౌట్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో అలాంటివి ఉంటాయి మరి.
వైసీపీ నేతలు హిందూత్వంపై దాడి చేయడానికి ఎలాంటి అవకాశాన్నీ వదలడంలేదు.. ఇంకా చెప్పాలంటే తప్పుడు మార్గాల ద్వారా సృష్టించుకుంటున్నారు. ఓ వైపు జగన్ రెడ్డి తాము హిందూత్వ ప్రతినిధులం అన్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి కోట్లు ఖర్చుపెట్టి ప్రచారం చేస్తూ.. మరో వైపు ఆయన సోషల్ మీడియా సైన్యం మాత్రం ఇలా హిందూత్వంపై దాడులు చేస్తూనే ఉన్నారు.

