మంగళగిరిని దక్షిణ భారతదేశంలో గోల్డ్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు, స్థానిక బంగారు చేతివృత్తిదారుల సామర్థ్యాన్ని పెంచడానికి అనేక ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇందు కోసం తాజాగా సీఆర్డీఏ భూమిని సిద్ధం చేయాలని నిర్ణయించింది. సీఆర్డీఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నారా లోకేష్ జెమ్స్ అండ్ జ్యూవలరీ పార్కును దేశంలోనే అత్యుత్తమ నమూనాగా నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పార్క్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది. యువతకు శిక్షణ, ఉద్యోగాలు, కెరీర్ మార్గదర్శనం అందించేందుకు మోడల్ కెరీర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నరాు.
75 ఎకరాల విస్తీర్ణంలో ఆభరణాల తయారీలో ఆధునిక శిక్షణ , డిజైన్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్లు బంగారు చేతివృత్తిదారులకు అధునాతన సాంకేతికతలు, డిజైన్ నైపుణ్యాలను అందిస్తాయి. కామన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా సంవత్సరానికి 4,000 మందికి ఆభరణాల తయారీలో అధునాతన శిక్షణ అందించే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ పార్క్‌లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం ద్వారా, ఆభరణాల రంగంలో పరిశోధన, అభివృద్ధి, సరికొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు.
అలాగే ఈ పార్క్ బెస్ట్ రీటైల్ మార్కెట్ గా ఉండాలని అనుకుంటున్నారు. దేశంలోని టాప్ 20 ఆభరణాల తయారీ సంస్థలను ఈ పార్క్‌లో తమ తయారీ యూనిట్లు , రిటైల్ షాపులను ఏర్పాటు చేయడానికి ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, మంగళగిరిని ఆభరణాల వాణిజ్య కేంద్రంగా మార్చడానికి దోహదపడుతుంది. ఓ వైపు మంగళగిరి చేనేతకు ప్రోత్సాహంతో పాటు.. మరో వైపు గోల్డ్ స్మిత్‌లకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు నారా లోకేష్ వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రయత్నాలు.. అక్కడి ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని మార్చనున్నాయి.