కర్ణాటకలోని సింధనూరు ప్రాంతం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే తలపిస్తోంది. నారా లోకేష్ పర్యటన సందర్భంగా సింధనూరులో తెలుగు ప్రజల నీరాజనం, అడుగడుగునా లభించిన ఘనస్వాగతం లభించింది. స్థానిక తెలుగు సంఘాలు, వివిధ పార్టీల నేతలు ఆయనకు స్వాగతం పలికారు. దీనికి
సింధనూరు గడ్డపై అడుగుపెట్టిన నారా లోకేష్‌కు స్థానిక తెలుగు ప్రజానీకం, అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. పీడబ్ల్యూడీ క్యాంప్ నుంచి హోసళ్లీ వరకు దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూ స్వాగతించారు. జై లోకేష్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఎల్లమ్మ దేవాలయం, అశోక్ భవన్ సర్కిల్ వద్ద తెలుగు యువత గజమాలతో ఆయనను సత్కరించారు. కేవలం తెలుగు వారే కాకుండా, స్థానిక కన్నడ నేతలు కూడా లోకేష్ పట్ల అభిమానం చూపించారు.
ఈ పర్యటనలో లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ. కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ కూడా లోకేష్‌తో కలిసి ప్రచార రథంలో ఉన్నారు. మహాత్మా గాంధీ సర్కిల్ నుంచి హోసళ్లీ క్యాంప్ వరకు వేలాది మంది యువతతో జరిగిన భారీ బైక్ ర్యాలీతో సింధనూరులో సందడిగా మారింది. ఎన్డీయే కూటమి నేతల మధ్య ఉన్న సమన్వయం, ముఖ్యంగా కుమారస్వామి వంటి అగ్రనేత లోకేష్‌తో కలిసి పర్యటించడం ఈ యాత్రకు ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది.
సింధనూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన రాజకీయాలకు సంబంధం లేనిది. హోసల్లీ క్యాంప్‌లో కేంద్ర మంత్రులు హెచ్.డీ. కుమారస్వామి, సంజయ్ సేథ్లతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరణ, ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్, హాస్టల్ భవనాలను ప్రారంభించేందుకు సింధనూరులో పర్యటిస్తున్నారు.
