నారా రోహిత్ కథానాయకుడిగా ఈరోజు ఓ కొత్త సినిమా పట్టాలెక్కనుంది. మంజునాథ్ దర్శకుడు. ఈ చిత్రంలో రోహిత్ మూగవాడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సినిమా మొత్తం ఓ కథానాయకుడు మూగవాడిగా కనిపించడం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి ‘శబ్దం’ అనే పేరు ఖరారు చేశారు. ‘సైలన్స్ ఈజ్ హిస్ వెపన్’ అనేది ఉపశీర్షిక. ఇదేం మూకీ సినిమా కాదు. సినిమాలో మిగిలినవాళ్లంతా మాట్లాడతారు. హీరోకే మాటలు ఉండవు. ఈ రోజు అమరావతిలో ఈ సినిమా ప్రారంభం కానుంది. నారా లోకేష్… క్లాప్ కొట్టబోతున్నాడు. ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన టీడీపీ నేతలు , మంత్రులు. ఎం.ఎల్.ఏ లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు.