మేలో విడుదల కావాల్సిన సినిమాల్లో `నారప్ప` ఒకటి. కరోనా – లాక్ డౌన్‌ల వల్ల అది వీలు పడలేదు. అందుకే… విడుదల తేదీ వాయిదా వేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. పైగా కొంతమేర షూటింగ్ కూడా బాకీ ఉండిపోయింది. ఇప్పుడు… ఆ ప్యాచ్ వర్క్ కూడా పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలూ అయిపోయాయి. మరో వారం రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందట. సో… `నారప్ప` విడుదలకు రెడీ అయినట్టే. 50 శాతం ఆక్యుపెన్సీతో.. తెలంగాణలో థియేటర్లు ఓపెన్ అయిపోయాయి. అయితే… నిర్మాతలు 100 శాతం ఆక్యుపెన్సీ కోసం ఎదురు చూస్తున్నారు. జులై రెండో వారంలో.. ఆ అవకాశం రావొచ్చు. 100 శాతం ఆక్యుపెన్సీ అవకాశం ఎప్పుడొస్తుందో.. అప్పుడు `నారప్ప`ని విడుదల చేస్తారు. ఆ కోవలో వచ్చే తొలి పెద్దసినిమా `నారప్ప`దే అవుతుంది. వెంకీ మరోవైపు `దృశ్యమ్ 2` చిత్రీకరణ కూడా దాదాపుగా పూర్తి చేసుకున్నాడు. ఇది ఓటీటీలో విడుదల చేయనున్నారు. మరి థియేటరికల్ రిలీజ్ ఆలోచన ఉందా? లేదా.? అనేది తెలియాల్సివుంది.