ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వగ్రామం నారా వారి పల్లి గ్రీన్ ఎనర్జీలో కొత్త రికార్డు సృష్టించింది. వంద శాతం గ్రీన్ ఎనర్జీని ఉపయోగిస్తోంది. గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 1,600 గృహాలు పైన సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేశారు. తద్వారా మండలం, నియోజకవర్గం మరియు రాష్ట్రమంతటా అమలు చేయాలని సంకల్పంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.
1,600 ఇళ్లను సౌరశక్తితో శక్తిని పొందుతూ, ఏటా 4.89 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. 1.92 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తున్నట్లుగా గుర్తించారు. గ్రామంలో ఉన్న ఇళ్లకు సరిపడా కరెంట్ సరిపోను.. మిగిలింది గ్రిడ్ కు అనుసంధానిస్తారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇంటిపై సోలార్ ప్యానల్స్ పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిస్తున్నారు. కేంద్రం నుంచి సబ్సిడీలు కూడా వస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు తన స్వగ్రామం నారావారిపల్లిలోనే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆమెకు వేగంగా పూర్తి చేశారు. ఈ కృషికి గాను స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్ట్ తొలి సంవత్సరంలోనే స్కోచ్ గోల్డెన్ అవార్డుతో గుర్తింపు లభించింది. స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్ట్ తొలి సంవత్సరంలోనే మంచి ఫలితాలు వచ్చాయని చంద్రగిరి ఎమ్మెల్యే సంతోషపడుతున్నారు.