ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కొత్త ప్రెసిడెంట్ గా నరేన్ కొడాలి బాధ్యతలను చేపట్టారు. తానా 24వ మహాసభల్లో చివరిరోజున నరేన్ కొడాలి, ఆయన టీమ్ బాధ్యతలను చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానాను మన పెద్దలు ఎంతో ఆశయంతో స్థాపించారు. స్వర్ణోత్సవాలు జరుపుకునే సమయంలో నేను ప్రెసిడెంట్ అయ్యే అవకాశాన్ని మీరంతా కలిగించారు. తానాలో నేను ఈ పదవిని చేపట్టడానికి ముందు ఓ సైనికుడిగా పోరాడిన విషయం మీకు తెలిసిందే. నా మీద విశ్వాసం ఉంచి నన్ను మీరు ఈ పదవికి ఎన్నుకుని నాపై బాధ్యతను పెట్టారు. ఈ స్వర్ణోత్సవాల వేళ తానాను మరింత బలంగా మార్చడానికి నేను కృషి చేస్తాను.
సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యాపరమైన కార్యక్రమాలతో తానాను మరింత బలంగా ఉండేలా చేస్తాను. ఇందుకోసం నాకు మద్దతుగా ఉండే టీమ్ ఉండాలన్న ఆశయంతో ఈ టీమ్‌ను ఎంచుకున్నాము. ఇప్పటి నుంటి ఈ టీమ్ తానా అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తుంది. నువ్వు తానాకు రావాలని నన్ను గుర్తించి తానాలో తీసుకువచ్చిన మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, పెద్దలు జయరామ్ కోమటి, గంగాధర్ నాదెళ్ళ సహకారంతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన నా కార్యవర్గంతో కలిసి తానాను అన్నీ విధాలుగా ముందుకు తీసుకువెళుతానని హామి ఇస్తున్నాను. నరేన్ కొడాలితోపాటు తానా కొత్త టీమ్ కూడా బాధ్యతలు చేపట్టింది.
శ్రీనివాస్ లావు (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), సునీల్ పంత్రా (సెక్రటరీ), వెంకట(రాజా) కసుకుర్తి (ట్రజరర్), లోకేష్ కొణిదెల (జాయింట్ సెక్రటరీ), రాజేష్ యార్లగడ్డ (జాయింట్ ట్రజరర్), కృష్ణ ప్రసాద్ సోంపల్లి (ఇంటర్నేషనల్ కోర్డినేటర్), మాధురి ఏలూరి (హెల్త్ సర్వీస్ కో ఆర్డినేటర్), నాగ మల్లేశ్వరరావు పంచుమర్తి (స్పెషల్ ప్రాజెక్ట్స్ కో ఆర్డినేటర్), పరమేష్ దేవినేని (మీడియా కోఆర్డినేటర్), సాయి బొల్లినేని (కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్), సోహ్ని అయినాల (ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్), సాయిసుధ పాలడుగు (కల్చరల్ సర్వీసెస్ కో ఆర్డినేటర్), సునీల్ కాంత్ దేవరపల్లి (సోషల్ వెల్ఫేర్ కో ఆర్డినేటర్), శివలింగ ప్రసాద్ చావా (స్పోర్ట్స్ కో ఆర్డినేటర్), వెంకట్ అడుసుమిల్లి (ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్), ఉమ కటికి (ఎన్నారై స్టూడెంట్ కో ఆర్డినేటర్), వెంకట్ సింగు (బెనిఫిట్స్ కో ఆర్డినేటర్) గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఫౌండేషన్ ట్రస్టీలుగా శ్రీకాంత్ దొడ్డపనేని, కిరణ్ దుగ్గిరాల, త్రిలోక్ కంతేటి, సతీష్ కొమ్మన, దేవేంద్ర రావు లావు, ఠాగూర్ మల్లినేని, సతీష్ మేకా, శ్రీనివాస్ ఓరుగంటి, మధుకర బి. యార్లగడ్డ, ఫౌండేషన్ డోనర్ ట్రస్టీలుగా శ్రీనివాస్ చంద్ గొర్రెపాటి, ప్రసాద నల్లూరి, బోర్డ్ డైరెక్టర్లుగా వెంకట్ కోగంటి, భరత్ మద్దినేని, జనార్ధన్ నిమ్మలపూడి, అనిల్ చౌదరి ఉప్పలపాటి, నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి బాధ్యతలు చేపట్టారు తానా ప్రాంతీయ ప్రతినిధులుగా న్యూ ఇంగ్లాండ్ – మౌనిక మణికొండ, న్యూయార్క్ – శ్రీనివాస్ భర్తవరపు, న్యూజెర్సీ – సుధీర్ చంద్ నారెపాలెపు, మిడ్ అట్లాంటిక్ – ఫణి కుమార్ కంతేటి, క్యాపిటల్ ఏరియా – సుధీర్ నాయుడు కొమ్మి, అప్పలాచియన్ – రవి చంద్ర వడ్లమూడి సౌత్ ఈస్ట్ – శేఖర్ కొల్లు, నార్త్ – రాంప్రసాద్ చిలుకూరి, ఒహియో వ్యాలీ – ప్రదీప్ కుమార్ చందనం, సౌత్ సెంట్రల్ – రవి కుమార్ పోట్ల, డిఎఫ్‌డబ్ల్యు – సతీష్ బాబు కోటపాటి, సౌత్ వెస్ట్ – మనోజ్ కుమార్ పాలడుగు, నార్త్ సెంట్రల్ – రామకృష్ణ వంకిన, సదరన్ కాలిఫోర్నియా – హేమకుమార్ గొట్టి, నార్తర్న్ కాలిఫోర్నియా – సుధీర్ ఉన్నం, నార్త్ వెస్ట్ – సుంకరి శ్రీరామ్ కూడా బాధ్యతలు చేపట్టారు.