దేశభ‌క్తి, ఎమ్‌.ఐ.ఎమ్‌… తెలంగాణ‌లో మోడీ ప్ర‌చారాంశాలు!

ఏ ఇంటి ద‌గ్గ‌ర ఏ పాట పాడాలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి బాగా తెలుసు! తెలంగాణలో ప్ర‌చారానికి వ‌చ్చేస‌రికి… ఇక్క‌డ వ‌ర్కౌట్ అయ్యే అంశాల‌ని వారు ఏవైతే అనుకుంటున్నారో, వాటినే ప్ర‌ధానంగా ప్ర‌స్థావిస్తూ ప్ర‌ధాని మాట్లాడారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మోడీ మాట్లాడుతూ…. దేశ‌భ‌క్తి, ఎమ్‌.ఐ.ఎమ్‌. ఈ రెండు అంశాల‌ను ప్ర‌ముఖంగా ప్ర‌స్థావించారు. హైద‌రాబాద్ లో అభివృద్ధి నిరోధ‌క శ‌క్తిగా ఎమ్‌.ఐ.ఎమ్‌. ఉంటోంద‌నీ, ప్ర‌జ‌ల్లో జీవితాల్లో మార్పులు రావ‌డం వారికి ఇష్టం ఉండ‌ద‌న్నారు. ఇక‌, ఇలాంటి పార్టీలో అధికార పార్టీ తెరాస చేతులు క‌లిపింద‌న్నారు. ఆరునెల‌ల సావాసం చేస్తే వారు వీరౌతార‌నీ, కేసీఆర్ వారితో ఆరేళ్లుగా సావాసం చేస్తూ వారి భావ‌జాలాన్ని, ఆలోచ‌నా విధానాన్ని అల‌వ‌ర‌చుకున్నార‌ని విమ‌ర్శించారు. పాల‌న కేసీఆర్ దే అయినా, స్టీరింగ్ మ‌జ్లిస్ చేతిలో ఉంద‌న్నారు.

సైనిక చ‌ర్య‌ల్ని రాజ‌కీయాల‌కు వాడుకోమ‌ని గ‌తంలో చాలాసార్లు చెప్పిన ప్ర‌ధాని… అదే టాపిక్ మాట్లాడారు. దేశంలో విచ్ఛిన్న‌క‌ర శ‌క్తుల‌ను మ‌ద్ద‌తు ఇచ్చేలా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌నీ, కానీ త‌మ వ్య‌వ‌హార శైలి ఎలా ఉంటుందో ప్ర‌జ‌ల‌కు తెలుసున‌నీ, శ‌త్రువులు ఎక్క‌డున్నా వారి ఇళ్ల‌లో దూరి ప‌ని ప‌డ‌తామ‌న్నారు. శత్రువులపై దాడుల‌కు వెళ్తే ఓటు బ్యాంకు ఏమౌతుందో అనే భ‌యం త‌మ‌కు లేద‌నీ, ఎన్నిక‌లు వ‌స్తాయి, పోతాయనీ, దేశాన్ని ర‌క్షించ‌డ‌మే ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం అన్నారు. దేశ‌ద్రోహులు, ప్ర‌జ‌లు మ‌ధ్య‌లో మోడీ అడ్డుగోడ‌గా నిల‌బ‌డి ఉంటార‌న్నారు. మ‌నంద‌రం క‌లిసి బ‌ల‌మైన దేశాన్ని నిర్మించాల‌నీ, దేశం బ‌లంగా ఉండాలంటే బ‌ల‌మైన ప్ర‌భుత్వం ఉండాల‌నీ, మీరు వేసే ఓటు బ‌ల‌మైన దేశం కోస‌మ‌నీ, బ‌ల‌మైన ప్ర‌భుత్వం కోస‌మ‌నీ, మీరు వేసే ఓటు మోడీ కోస‌మ‌ని చెప్పారు. మోడీ టు దేశం అన్న‌మాట‌!

దేశ ప్ర‌ధాని ప్ర‌సంగంలో.. ఐదేళ్ల పాల‌న‌లో విజ‌యాల ప్ర‌స్థావ‌న లేదు. ఐదేళ్ల‌పాటు ప్ర‌జ‌ల బ‌తుకుల్లో వారు తీసుకొచ్చిన అనూహ్య మార్పుల అంశాలు లేవు. స‌రే, అవ‌న్నీ మాట్లాడాల‌నుకుంటే డీమాన‌టైజేష‌న్ లాంటి ఘోర వైఫ‌ల్యాలు ప్ర‌జ‌ల‌కు గుర్తొస్తాయ‌నే అనుకుందాం! అలాంట‌ప్పుడు, రాబోయే ఐదేళ్ల‌లో ఏం చెయ్య‌బోతున్నారు, దేశానికి కొత్త దిశ ఎలా ఇవ్వ‌బోతున్నారు, ప్ర‌ధానిగా దేశానికి ఇవ్వ‌నున్న కొత్త‌ మార్గ‌ద‌ర్శ‌క‌త్వం ఏంటి… ఇలాంటివేవీ మోడీ ప్ర‌సంగాల్లో ఉండ‌టం లేదు. ఒక స‌గ‌టు రాజ‌కీయ నాయ‌కుడి మాదిరిగా… భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టే అంశాల‌ను మాత్ర‌మే ఎన్నిక‌ల ప్ర‌చారంలో వాడుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close