అసమాన నటనా ప్రతిభతో దశాబ్దాల పాటు వెండితెరను అలరించిన కోట శ్రీనివాసరావు కన్నుమూయడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాప సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
కోట శ్రీనివాసరావు మరణం బాధాకరమని.. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారన్నారు. ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారన్నారు. పేదలు , అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. కోట శ్రీనివాసరాను కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు సంతాపం తెలియచేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగుతో పాటు ఇంగ్లిష్లోనూ తన సంతాప సందేశాన్ని ఇచ్చారు. కోట శ్రీనివాసరావు .. నటనా ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పద్మశ్రీ అవార్డు కూడా ఆయనను వరించింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. తర్వాత ఆయన రాజకీయాలకు విరామం తీసుకున్నారు.
ఇతర భాషల్లో కోట శ్రీనివాసరావు పరిమితంగానే చేసినా..తెలుగులో దిగ్గజంగా గుర్తింపు పొందారు. ప్రధాని మోదీ దేశ కళారంగానికి గుర్తింపు తెచ్చిన అందరి సేవలను గుర్తు పెట్టుకుంటారు. తెలుగు సినీ పరిశ్రమ విషయంలో ప్రధాని మోదీ ఎంతో ఆసక్తి చూపిస్తారు. కోట శ్రీనివాసరావు కు స్వయంగా ప్రధాని మోదీ తెలుగులో నివాళులు అర్పించడం .. తెలుగు కళాకారుని ప్రతిభ ఆకాశమంత విస్తరించిందనడానికి నిదర్శనం అనుకోవచ్చు.