లద్దాఖ్‌లో సడన్‌ టూర్.. చైనాకు హెచ్చరికలు పంపిన మోడీ..!

భారత భాభాగాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ.. చర్చల పేరుతో టైంపాస్ చేస్తున్న చైనా కు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యూహాత్మకంగా అడుగులేశారు. హఠాత్తుగా చైనా సరిహద్దుల్లో పర్యటించారు. అక్కడి సైనికులతో మాట్లాడారు. వారిలో మరింత స్ఫూర్తి నింపారు. లద్దాఖ్‌లోని నిము ప్రాంతానికి మోడీ వెళ్లారు. సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఆ ప్రాంతం ఉంటుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో ప్రధాని మాట్లాడారు. ప్రపంచం మొత్తానికి భారత్‌ శక్తి సామర్థ్యాలు నిరూపించామని సైనికులను అభినందించారు.

జల, వాయు, పదాతి, అంతరిక్షం విభాగాల్లో మన శక్తి సమున్నతంగా ఉందని.. విస్తరణకాంక్షతో సాగిన శక్తులు తోకముడవడమో లేక ఓటమో చవిచూశాయని చరిత్రలో ఇదే ఉందని గుర్తు చేశారు. గల్వాన్ ఘటన తర్వాత చైనా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొద్ది కొద్దిగా దేశ భూభాగంలోకి వస్తూనే ఉంది. అయితే సైనిక చర్చల పేరుతో.. చైనా.. భారత్ ను నిలువరిస్తోంది. మరో వైపు చేయాల్సిన పని చేస్తోంది. ఈ సమయంలో చైనాను నిలువరించడానికి మోడీ వ్యూహాత్మకంగా సరిహద్దులకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇంక ఏ మాత్రం.. సహించే ప్రశ్నే లేదని.. అవసరం అయితే యుద్ధానికి సైతం సిద్ధమన్న సంకేతాలను మోడీ చైనాకు పంపారని అంటున్నారు. సరిహద్దు వద్ద మోడీ పర్యటించడంతో.. చైనా ఉలిక్కి పడింది.

ప్రత్యేకంగా ఎలాంటి పేరు చెప్పకుండా… ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని.. ఎవరూ పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహరించకూడదని నీతుల ప్రకటన చేసింది. మోడీ లద్దాఖ్ పర్యటన.. అంతర్జాతీయంగానూ హైలెట్ అయింది. ఇంత కాలం భారత్ ఇరుగు పొరుగు దేశాలతో శాంతిని కోరుకుందని.. ఇప్పుడు తమ భూభాగంపైనే కన్నేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు అయిందన్న విశ్లేషణ అంతటా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ రాజధానిపై కేంద్రం తేల్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రానికి సంబంధం లేదని.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని... కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా.. రాష్ట్ర పరిధిలోనిదా...

రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు...

దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని... దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే...

రామాలయ భూమిపూజ లైవ్ ఇవ్వని ఎస్వీబీసీ..! బీజేపీ విమర్శలు..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ... ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి...

HOT NEWS

[X] Close
[X] Close