ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సారి విశాఖలో యోగా డేలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ప్రసంగంలో.. యోగా డే రోజు విశాఖలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తర్వాద మోదీ తన ప్రసంగంలో దీనికి సమాధానం ఇచ్చారు. ఆహ్వానించినందుకు సంతోషం అని తాను ఖచ్చితంగా యోగాడేలో పాల్గొనేందుకు విశాఖకు వస్తానన ప్రకటించారు. అంటే మోదీ పర్యటన జూన్ 21న ఖరారు అయిందన్నమాట.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా యోగాడేగా గుర్తించేలా చేసింది. భారతీయానికి సంబంధించిన యోగా ఆరోగ్య సంరక్షణా విధానాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ యోగా దినోత్సవాన్ని నోటిఫై చేసింది. 2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. ఆ తర్వాత ప్రతి ఏటా ప్రధాని మోదీ ఆ రోజున ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. గత ఏడాది జమ్మూకశ్మీర్ లో పాల్గొన్నారు. ఈ సారి ఏపీలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
యోగాను ప్రధాని మోదీ రోజు దినచర్యలో భాగంగా చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంతే. ఇద్దరికీ యోగాపై ప్రత్యేకమైన ఆసక్తి ఉండటంతో పాటు దాన్ని విస్తృతంగా ప్రజలకు రోజువారీ అలవాటుగా మారేలా చేయాలనుకుంటున్నారు. దీని వల్ల అరోగ్యం మెరుగుపడుతుందని.. ప్రజారోగ్యానికి కీలకమని అంచనా వేస్తున్నారు.